దారుణం: కూలీ పని ఉందని మహిళను తీసుకెళ్లి..

29 Jul, 2021 08:57 IST|Sakshi
భామిని (ఫైల్‌)

సాక్షి, జిన్నారం (మహబూబ్‌నగర్‌): పని కోసం తీసుకువచ్చిన ఓ మహిళపై ఉన్న నగలు తీసుకొని, అత్యాచారం, హత్య చేసిన సంఘటన జిన్నారం మండలం మాదారం పంచాయతీ మంత్రికుంట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. దుండిగల్, బొల్లారం పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాకు చెందిన భామిని(39) కుటుంబంతో కలిసి మేడ్చల్‌ జిల్లా మల్లంపేటలో ఉంటూ, అడ్డా కూలీగా పని చేస్తోంది.

ఈనెల 25న కూలీ పని ఉందని ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండాపోయింది. భర్త దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బుధవారం మంత్రికుంట శివారు అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్‌ డీఎస్పీ లింగారెడ్డి, దుండిగల్‌ సీఐ రమణారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలు భామినిగా గుర్తించారు. ఆమెను తీసుకెళ్లిన స్వామి, నర్సమ్మను విచారిస్తున్నామని సీఐ రమణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు