అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో రవికాంత్‌ ప్రతిభ | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఫొటోగ్రఫీలో రవికాంత్‌ ప్రతిభ

Published Mon, Nov 20 2023 2:42 AM

అవార్డు అందుకుంటున్న రవికాంత్‌ - Sakshi

మామిడికుదురు: దుబాయ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో మామిడికుదురు మండలం మొగలికుదురు వాసి కూర్మా రవికాంత్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కేటగిరీలో మొదటి బహుమతి సాధించాడు. ఈ నెల 16వ తేదీన దుబాయ్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో రవికాంత్‌కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ప్రశంసాపత్రంతో పాటు 15 వేల యూఎస్‌ డాలర్లు (రూ.12.50 లక్షలు) నగదు బహుమతి అందించారు. ‘ఎ డ్యాన్స్‌ ఆఫ్‌ సీగల్స్‌’ పేరిట ఈ పోటీ నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని రవికాంత్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ పోటీల్లో మన దేశం నుంచి తానొక్కడినే పాల్గొన్నానని చెప్పారు. బీటెక్‌ పూర్తి చేసిన రవికాంత్‌ ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో మొదటి బహుమతి గెలుపొందిన రవికాంత్‌ను పలువురు అభినందించారు.

Advertisement
Advertisement