విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి | Sakshi
Sakshi News home page

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

Published Sat, Dec 16 2023 2:20 AM

- - Sakshi

ఈ షోరూం అద్భుతం

నెల్లూరు(బృందావనం): వివాహాది శుభకార్యాల్లో సీ్త్రమూర్తులతోపాటు అందరూ ధరించే సనాతనమైన, నూతనమైన వస్త్రాలతో నెల్లూరులో కొత్తగా ప్రారంభించిన కాంచీపురం పెరుమాళ్‌ శిల్క్స్‌ షోరూం ఎంతో అద్భుతంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. నగరంలోని మినీబైపాస్‌ రోడ్డు అన్నమయ్య సర్కిల్‌లో కాంచీపురం పెరుమాళ్‌ శిల్క్స్‌ షోరూంను గురువారం స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్‌ ఆహ్వానం మేరకు ఈ షోరూంను ప్రారంభించేందుకు వచ్చానన్నారు. ఈ షోరూంలోని రకరకాల వస్త్రాలు కనువిందు చేస్తున్నాయన్నారు. ప్రతి మహిళ, సీ్త్రమూర్తి ఆభరణాలను, వస్త్రాలను ధరించి పరిపూర్ణంగా ఉండాలన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ నెల్లూరులో తొలుత న్యూరాజ్యలక్ష్మీ హాల్‌ను, ఆ తరువాత శుభమస్తు షాపింగ్‌మాల్స్‌ను స్థాపించి అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంచీపురం పెరుమాళ్‌ శిల్క్స్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నమ్మకానికి ప్రతిరూపంగా ఈ వస్త్రదుకాణాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద వెడ్డింగ్‌మాల్‌ కాంచీపురం పెరుమాళ్‌ శిల్క్స్‌ను నెల్లూరులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆ షోరూం అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్‌ సోదరులు పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్లు పి.రూప్‌కుమార్‌యాదవ్‌, మొహ్మద్‌ ఖలీల్‌అహ్మద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌, రామ్‌రాజ్‌ కాటన్‌ ఫౌండర్‌, చైర్మన్‌ కె.ఆర్‌.నాగరాజన్‌, సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి నాగారెడ్డి హరికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement