మెడి టిప్‌: స్పాండిలోసిస్‌ పెరగకుండా జాగ్రత్తలివి.. | Sakshi
Sakshi News home page

మెడి టిప్‌: స్పాండిలోసిస్‌ పెరగకుండా జాగ్రత్తలివి..

Published Sun, Jan 14 2024 1:02 PM

Be Careful With Spondylosis - Sakshi

మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు  వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్‌’ అంటారు. ఈ  నొప్పి తగ్గడానికీ.. అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్‌ నివారణకూ పాటించాల్సిన జాగ్రత్తలివి..

  • బరువైన వస్తువులు.. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటి పనులు చేయకూడదు.
  • తలపైన బరువులు (మూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు.
  • పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్‌ ఉండేలా జాగ్రత్తపడాలి.
  • తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్‌ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్‌ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్‌ ఉంటుంది.
  • సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే  సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గనివారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

ఇవి చదవండి: చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Advertisement
Advertisement