లైపోసక్షన్‌ వికటించి స్టార్‌ సింగర్‌ కన్నుమూత, విషాదంలో ఫ్యాన్స్‌ 

27 Jan, 2024 11:50 IST|Sakshi

బ్రెజిలియన్ పాప్ స్టార్ డానీ లీ (42) మరణించిన ఘటన  విషాదాన్ని నింపింది. లైపోసక్షన్  మెట్రో కథనం రిపోర్ట్‌ ప్రకారం  బ్రెజిల్‌లో  గాయనిగా పాపులర్‌ అయిన లీ  బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్‌ చేయించుకుంది. అయితే  ఆపరేషన్‌ తరువాత సమస్యలు తలెత్తడంతో  ఆసుపత్రలో కన్నుమూసింది. ఇది ఊహించని  పరిణామమంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు తమ అభిమాన  స్టార్‌ సింగర్‌ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్‌  కూడా దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. 

బ్రెజిల్‌లోని పిన్‌హైస్‌లో నిర్వహించిన బొడ్డు, వీపుపై లైపోసక్షన్‌తో పాటు రొమ్ములను తగ్గించుకునేందు కూడా  ఆపరేషన్‌ చేయించుకుంది. అయితే   పరిస్థితి విషమించడంతో సమీపంలోని మీపంలోని కురిటిబాలోని ఒక ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. లీకి భర్త, ఏడేళ్ల కుమార్తె ఉంది.  గాయని మృతిపై విచారణ జరుగుతోందని  మెట్రో నివేదించింది.

అమెజాన్‌లోని అఫువా అనే ద్వీపంలో పుట్టిన లీ సింగర్‌అయ్యేందుకు చిన్నతనం  నుంచీ  కృషి చేసింది.  2014లో విడుదలైన ఆమె 'యూ సౌ డా అమెజోనియా' (ఐ యామ్ ఫ్రమ్ ది అమెజాన్) అనే పాటతో గాయనిగా ఆమె ప్రసిద్ధి చెందింది. అయిదేళ్ల వయసునుంచే పాడటం ప్రారంభించిన ఆమె టాలెంట్ షోలతో పేరు తెచ్చుకుంది.  ఆ తరువాత  సింగింగ్‌  కరియర్‌  కోసం  17 సంవత్సరాల వయస్సులో మకాపాకు వెళ్లింది. 'వెమ్ మీ డైజర్', 'ప్రా వోస్ ఫికార్ కోమిగో' 'కైక్' తదితర పాటలో  స్టార్‌  సింగర్‌గా ఎదిగింది.  ఆమె చివరి పాట ‘గుయెర్రా డి అమోర్' జనవరి 14న విడుదలైంది.డాని లి, అసలు పేరు, డానియెల్ ఫోన్సెకా మచాడో.

A post shared by Dani Li (@danili.dl)

whatsapp channel

మరిన్ని వార్తలు