నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా? | Sakshi
Sakshi News home page

నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?

Published Tue, Mar 5 2024 4:28 PM

Do you  know the Nalleru nutritional value health benefits - Sakshi

ప్రకృతిని  ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు  కానీ..  ప్రతి మొక్కలోనూ  ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి  ఉన్నాయి.  అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు.   నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.!

పట్టణ  వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు  వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో,  డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ   కాడల్ని  పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు.  ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. 

నల్లేరుతో వంటలు
అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి.  ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు.

నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. 

వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని,  వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు  చెబుతున్నారు. 

ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది.

ఔషధ గుణాలు
ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా  శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి.

దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు.

నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్‌కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.
 

Advertisement
Advertisement