How To Make Coconut Poha Recipe At Home - Sakshi
Sakshi News home page

Coconut Poha Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ కోసం వేడివేడిగా కొబ్బరి పోహా ఇలా తయారుచేసుకోండి

Published Tue, Jun 20 2023 2:31 PM

How To Make Coconut Poha Recipe - Sakshi

కోకోనట్‌ పోహా తయారీకి కావాల్సినవి..

కొబ్బరి కోరు – అర కప్పు
అటుకులు – ఒకటిన్నర కప్పులు (వాడుకునే 2 నిమిషాల ముందు జల్లెడ తొట్టెలో వేసుకుని నీళ్లు పోసి, 2 సార్లు కడిగి, ఆరబెట్టుకోవాలి)
ఆవాలు, జీలకర్ర – పావు టీ స్పూన్‌ చొప్పున
శనగపప్పు – 1 టీ స్పూన్‌

పచ్చిమిర్చి – 2 లేదా 3 (నిలువుగా కట్‌ చేసుకోవాలి)
నూనె – సరిపడా, ఉప్పు – రుచికి తగ్గట్టుగా

అల్లం తరుగు – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్, 

కరివేపాకు –2 రెబ్బలు
జీడిపప్పు, వేరుశనగలు – కొన్ని చొప్పున (దోరగా వేయించి పెట్టుకోవాలి)
ఎండుమిర్చి – 2

తయారీ విధానం ఇలా..
ముందుగా నూనెలో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుని తిప్పుతూ పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. అందులో జీడిపప్పు, వేరుశనగలు, తగినంత ఉప్పు, కొబ్బరికోరు వేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు చిన్నమంట మీద ఉడకనివ్వాలి. అనంతరం అటుకులు వేసుకుని బాగా కలిపి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే భలే ఉంటుంది ఈ పోహా

Advertisement
Advertisement