వాలు కనుల కోసం ఎలక్ట్రిక్‌ ఐలాష్‌ కర్లర్‌.. ఎలా పనిచేస్తుందంటే! | Sakshi
Sakshi News home page

బ్యూటీ లవర్స్‌ కోసం ఎలక్ట్రిక్‌ ఐలాష్‌ కర్లర్‌.. ఎలా పనిచేస్తుందంటే!

Published Sun, May 14 2023 5:48 PM

How To Use And Best Heated Eyelash Curlers - Sakshi

కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్‌ స్టిక్కర్స్‌ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్‌ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్‌ ఐలాష్‌ కర్లర్‌! ఇందులో చాలా మోడల్స్‌.. చాలా ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

1. ఈ మోడల్‌ టూల్‌.. త్రీ టెంపరేచర్‌ మోడ్స్‌తో పనిచేస్తుంది. మొదటి మోడ్‌ షార్ట్‌ ఐలాషెస్‌కి బ్లూ లైట్‌తో లో – టెంపరేచర్‌ని, రెండవ మోడ్‌.. స్టాండర్డ్‌ ఐలాషెస్‌కి ఎల్లో కలర్‌తో మీడియం టెంపరేచర్‌ని అందించగా.. మూడవ మోడ్‌ హార్డ్‌ ఐలాషెస్‌కి రెడ్‌ కలర్‌తో హై టెంపరేచర్‌ని అందిస్తుంది. 10 సెకండ్స్‌లో ఫాస్ట్‌ హీటింగ్, 40 సెకండ్స్‌లో రాపిడ్‌ కర్లింగ్‌ సెట్‌ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్‌ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్‌ లుక్‌తో ఉంటాయి.  ఈ టూల్‌కి ఉండే మినీ హీటర్‌.. డబుల్‌ లేయర్‌ కోంబ్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్‌ పెడితే చాలా కాలం నడుస్తుంది.

2. ఈ టూల్‌ కూడా మల్టీ ఫంక్షనల్‌ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్‌ సెట్టింగ్స్‌తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్‌ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్‌ అచ్చం హెయిర్‌ కర్లర్‌లా.. మినీ హీటర్‌ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్‌ ముందున్న చిన్న బటన్‌ యూజ్‌ అవుతుంది.

3.ఈ టూల్‌.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్‌ వంటివి డివైజ్‌కి ఉన్న డిస్‌ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్‌ మాదిరి సులభంగా హ్యాండ్‌ బ్యాగ్‌లోనో లేదా మేకప్‌ కిట్‌లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్‌ని గమనించి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేయండి.

Advertisement
Advertisement