Journey Of The Hrithayapoorvvam Pothichoru Meal Parcel At Kerala In Telugu - Sakshi
Sakshi News home page

Hrithayapoorvvam Pothichoru Journey: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్‌ సమాజం సేవ చేసేలా..!

Published Mon, Jun 26 2023 11:02 AM

Journey Of The Hrithayapoorvvam Pothichoru Meal Parcel  At Kerala - Sakshi

'సేవ' అంటే ఆయా వ్యక్తుల వారికి తోచిన రీతిలో అనాథలకు, అభాగ్యులకు తమ సర్వీస్‌ని అందిచడం. కొందరూ కొన్ని స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా సేవలందిస్తారు. అలా ఇలా కాకుండా యావత్తు సమజాన్ని మహత్తర సేవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అంటే మాటలకందని విషయం. అలా సాధ్యమా! అనిపిస్తుంది కూడా. ఔను! సాధ్యమే అంటూ కేరళకు చెందిన ఓ యువజన సంస్థ చేసి చూపించింది.

కేరళలో వేలాది మహిళలు తమ కుంటుంబానికి సరిపడా వంట కంటే అదనంగా వండుతారు. ఒకరికో లేదా ఇద్దరికో సరిపడే ఆహారం అయ్యి ఉండొచ్చు. అయితే వారు చేసిన భోజనం పొట్లం ఏ అతిధికి చేరుతుందో ఎవరో తింటారో వారికి తెలియదు. అయినా వారంతా తమ వంతుగా ఈ సేవలో భాగమవుతున్నారు. దీన్ని కేరళలో 'పోతిచూరు' అంటారు. 'పోతిచోరు' అంటే భోజనం పొట్లం అని అర్థం. అలా అందించేవాళ్లు ధనవంతులు కారు. వారంతా సామాన్య ప్రజలు. వారు వండుకునే దానిలో కొంచెం ఇలా ప్యాక్‌చేసి పొట్లాల రూపంలో అందిస్తారు. ఇలా మొత్తం 40 వేల పోతిచోరు(భోజనం పొట్లాలు) వస్తాయంటే నమ్ముతారా?. ఔను} స్వచ్ఛందంగా చిన్న చితక పనులుచేసుకునే ప్రజల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఇలా తమకు తోచినన్ని ఆహార పొట్లాలను ఇవ్వడం జరుగుతోంది.

ఇలా కేరళలో 2017 నుంచి జరుగుతోంది. ఆ భోజన పోట్లాలన్ని ఆయా జిల్లాలోని ప్రభుత్వా ఆస్పత్రులకు వచ్చే పేదలకు, ప్రయాణికులకు, వృద్ధులకు చేరతాయి. దీన్ని సీపీఐ(ఎం) యువజన సంస్థ అయిన డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీవైఎఫ్‌ఐ) 2017లో తిరువనంతపురం మెడికల్‌ కాలేజ్‌లో 300 పోతిచోరు ప్యాకెట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని "హృదయపూర్వం" అని కేరళలో పిలుస్తారు. దీని అర్థం హార్టీ మీల్‌ పార్సెల్‌ అని.  ఆ తర్వాత ఆరేళ్లకు క్రమక్రమంగా కేరళలోని 14 జిల్లాలోని 50 ఆస్పత్రులకు ప్రతి రోజు 40 వేల పోతిచోరులు పంపిణీ చేసే స్థాయికి వచ్చిందని డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్‌ చెప్పారు. ఈ హృదయపూర్వం కార్యక్రమం కోసం ప్రత్యేక కిచెన్‌ కమ్యూనిటీఏమి లేదు.

ఆ ఆహారపు పొట్లాలన్ని ఒక్కక్కొరి ఇళ్ల నుంచి సేకరించినవేనని చెబుతున్నారు. ఈ డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో హృదయపూర్వం కార్యక్రమం కోసం పోతిచోరు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది ఆహార పంపిణీకి సంబంధంచిన క్యాలెండర్‌ ముందుగానే పక్కాగా సిద్ధం చేస్తారు. ఆ జాబితా ఆధారంగా డీవైఎప్‌ఐ మండలి కమిటీలతో పంచుకుంటారు. ఆ తర్వాత మండల కమిటీలు ఒకదాని తర్వాత మరొకటి ఆహార పంపిణీ బాధ్యతలను తీసుకుంటాయి. ముందుగా డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు వారి ప్రాంతంలోని ఇళ్లను సందర్శించి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం కోసం అదనంగా ఒకరికి భోజనం వండమని కోరతారు. కానీ వారంతా ఇద్దరు లేదా మూడు నుంచి ఐదు వరకు ఆహారపొట్లాలు సమకూర్చడం విశేషం. ఇక ఆ తర్వాత కార్యకర్తల ఈ సేకరించిన అదనపు ఆహారాన్ని నియమించిన ప్రభుత్వ ఆస్పత్రులలో పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం సమాజం మద్దుతునే జయప్రదంగా జరుగుతోంది.

ఈ కార్యకర్తలు, వరదలు, లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అలమటించే అభాగ్యులకే గాక డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బందికి, ప్రయాణికులకు ఆ ఆహారపొట్లాలను అందిస్తారు. ఇలా పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఓ ఆసక్తికరమైన ఘటన.. మలప్పురం మంపాడ్ ఎంఈఎస్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేష్ మోంజీ ఈ ఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఉన్నారు. ఆయనకు ఈ పోతిచోరు పొట్లం అందింది. ఆయన ఆ పొట్లం విప్పి చూడగా.. ఒక చిన్నారి రాసిన చిన్న కాగితపు నోటు కనిపించింది.

ఆ నోట్‌లో ఇలా ఉంది.."చెట్టా, చెచీ, ఉమ్మా, తథా, అమ్మా..అని ఉంది. అంటే  ఈ ఫుడ్ పార్శిల్ ఎవరికి అందుతుందో వారు ముందుగా నన్ను క్షమించండి. మా అమ్మ ఇంట్లో లేదు. నేను స్కూల్‌కి వెళ్లే తొందరలో దీన్ని సిద్ధం చేశాను. ఆహారం రుచిగా లేదు. అలాగే మీరు త్వరగా కోలుకోండి." అని రాసి ఉంది. ఆ పోతిచూరులో ఉన్న ప్రతి బియ్యపు గింజలో ఆ చిన్నారి ప్రేమతో నిండిపోయింది అని ఉపాధ్యాయుడు తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నిజానికి ఇది కేవలం ఆహార కాదు అంతకుమించినది.

ఈ భోజన పంపిణీని దాతృత్వంగా భావించొద్దు ఎందుకంటే ప్రస్తుతం యువతో పెరుగుతున్న స్వార్థాన్ని అంతం చేసేందుకు ఇది చక్కగా దోహదపడుతోంది అన్నారు సీపీఎం రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్‌. కాగా, ఈ ఆహారపొట్లాల సేకరణలో భాగం పంచుకుంట్ను ఓ గృహిణి మాట్లాడుతూ..పోతిచోరు సేకరణ తేది ఎప్పుడూ అని తెలుసుకుని...ఇలా పిడికెడు అన్నం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగినంతలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెబుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement