మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే! | Sakshi
Sakshi News home page

మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!

Published Mon, Mar 4 2024 4:29 PM

Smoking leads to Major Male Reproductive Problems - Sakshi

ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు,  ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్‌ లాంటి ప్రాణాంతక  జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు.  పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు.

అంతేకాదు ధూమపానం చేయకపోయినా  పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల  సన్నిహిత కుటుంబ సభ్యులు,  చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్‌ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ  వ్యాధుల బారిన పడతారు.

 లైంగిక సామర్థ్యంపై దెబ్బ
ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై  కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. 

తాజాగా  డా. శ్రీకాంత్‌ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్‌లో పొగబాబులకు అర్థమయ్యేలా   ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ వివరాలు...

(క్రికెట్‌లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్  కావడం) 

Advertisement
Advertisement