Health Tips: ఆకలి నశించడం, అలసటగా అనిపిస్తోందా? అయితే.. | Sakshi
Sakshi News home page

Sunstroke And Remedies: వేసవికాలం.. ఆకలి నశించడం, అనారోగ్యంగా అనిపిస్తోందా? అయితే..

Published Tue, Mar 15 2022 11:55 AM

Summer Care Tips: Symptoms Of Sun Stroke And Remedies In Telugu - Sakshi

వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయి. ఉదయం పదకొండు దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మరి.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే సన్‌స్ట్రోక్‌(వడదెబ్బ) తగిలితే అంతే సంగతులు! ఈ గడ్డు కాలాన్ని దాటాలంటే లక్షణాలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది.

లక్షణాలు:
తలనొప్పి, తల తిరగడం, మెదడు బ్లాంక్‌గా మారి అయోమయంలోకి జారిపోవడం
ఆకలి నశించడం, అనారోగ్యంగా అనిపించడం, ఫలానా సమస్య అని స్పష్టంగా తెలియకపోవడం, అలసట 
చేతులు, కాళ్లు, కడుపు కండరాల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం 
ఊపిరి తీసుకోవడంలో వేగం పెరగడం 
దేహం ఉష్ణోగ్రతలు పెరగడం... 
పిల్లలైతే ఊరికే పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. లేచిన తర్వాత కూడా హుషారుగా ఉండలేకపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే సన్‌స్ట్రోక్‌ నుంచి సాంత్వన కోసం వైద్యం చేయాల్సిందే.

సాంత్వన ఇలాగ
ఎండ నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి మారాలి.
పడుకుని పాదాలను కొంచెం ఎత్తులో ఉంచాలి.
డీ హైడ్రేషన్‌కు గురయిన దేహం తిరిగి హైడ్రేషన్‌ పొందడానికి ఇన్‌స్టంట్‌ రీ హైడ్రేషన్‌ ద్రవాలను తాగాలి.
తడి టవల్‌తో దేహాన్ని, పాదాలను, అరచేతులను, ముఖాన్ని, మెడను తరచుగా తుడవాలి. ∙గాలి ధారాళంగా తగిలేటట్లు, హాయిగాఊపిరి పీల్చుకోగలిగిన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే అరగంట సేపటికి వడదెబ్బ నుంచి దేహం సాంత్వన పొందుతుంది. తీవ్రంగా వడదెబ్బ బారిన పడినప్పుడు నీళ్లు, ఇతర రీ హైడ్రేషన్‌ ద్రవాలు ఏవి తాగినా వాంతి అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్‌ పెట్టించుకోవాల్సి ఉంటుంది.

చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక

Advertisement
Advertisement