వెడ్డింగ్‌ సీజన్‌: ఇన్‌స్టెంట్‌ గ్లో, ఫ్రెష్‌ లుక్‌ కావాలంటే..! | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్‌ సీజన్‌: ఇన్‌స్టెంట్‌ గ్లో, ఫ్రెష్‌ లుక్‌ కావాలంటే..!

Published Wed, Feb 21 2024 9:52 AM

Wedding season Tips for Instant Glow In Just 10 Minutes - Sakshi

సమ్మర్‌ వచ్చిందంటే..వెడ్డింగ్ సీజన్ వచ్చేసినట్టే.. ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోచ్చు. అందంగా,  సూపర్ స్టైలిష్ లుక్‌తో అందరిలో స్పెషల్‌గా కనిపించాలి అందరీకి ఉంటుంది.  అందులోనూ చాలా మంది ఆఫీసులో పని తర్వాత పెళ్లికో,  రిసెప్షన్‌కో  హాజరు కావాల్సిన పని ఉంటుంది.  పని ఒత్తిడి  ఖచ్చితంగా  ముఖం మీద కనిపిస్తుంది.  మరి అలాంటి ఇన్‌స్టెంట్‌గా ఫేస్‌లో గ్లో కావాలంటే  ఏం చేయాలి.  చిన్న టిప్స్‌ ద్వారా చర్మానికి తక్షణ నిగారింపు తీసుకురావచ్చు. అవేమిటో చూద్దాం..

క్లెన్సింగ్‌: ముందుగా కొద్దిగా రోజ్‌ వాటర్‌ ని తీసుకుని.. దానిని ముఖం అంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్‌ కి టోనర్‌ గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది.

స్క్రబ్బింగ్‌: ఆ తర్వాత ఫేస్‌ కి స్క్రబ్బింగ్‌ చేయాలి. ఇందుకోసం టమాటాను తీసుకుని దాన్ని మధ్యలోకి కట్‌ చేయాలి. ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అద్ది దానితో ముఖంపై రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు, ట్యాన్‌ తొలగి చర్మం మిలమిలలాడుతుంది.

మసాజ్‌: కలబంద గుజ్జు... అదేనండీ... కాస్తంత అలోవెరా జెల్‌ను తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్‌ చేయాలి. ఆలోవెరాలో మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉండటం వల్ల అది మీ చర్మాన్ని కాంతిమంతంగా, మృదువుగా ఉండేలా చేస్తుంది. 

బొప్పాయి: ఇంట్లో బొప్పాయి పండు ఉందా? కేవలం 10 నిమిషాల్లో ముఖానికి అందమైన మెరుపు కావాలంటే  బొప్పాయిని మించింది లేదు.బొప్పాయిలో విటమిన్‌ ఏ, సీ,మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చిన్న బొప్పాయిని ముక్క తీసుకొని ముఖమంతా 10 నిమిషాలు  మసాజ్‌ చేస్తే, చక్కటి గ్లో వస్తుంది.

పాలు: పాలలో విటమిన్‌ ఏ, సీ, బి6, బి12, కాల్షియం, పొటాషియం , చర్మానికి  మేలు చేస్తాయి. పచ్చి పాలలో కాటన్ ప్యాడ్‌ని ముంచి ముఖం, మెడ అంతటా అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. కాంతి వంతంగా, ఫ్రెష్‌లుక్‌ మీ సొంతం.

Advertisement
Advertisement