సంతోషం, సంతృప్తి... సాంకేతికత లక్ష్యం | Sakshi
Sakshi News home page

సంతోషం, సంతృప్తి... సాంకేతికత లక్ష్యం

Published Tue, Oct 13 2020 1:34 AM

PV Prabhakar Rao Article On PV Narasimha Rao - Sakshi

సమాజంలో మనుషుల జీవనం నిరంతర ప్రవాహం. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగైన జీవనం సాగించాలనే తపన సహజం. మానవాళి అవసరాల్ని తీర్చే సాధనాలు సమకూరితేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు దోహ దపడేది శాస్త్ర, సాంకేతికత. వర్త మాన అవసరాలు తీర్చుతూనే భావి భారతంలో ప్రజలు మెరుగైన జీవనం సాగించేలా శాస్త్ర, సాంకేతికతపై పూర్వ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దృష్టి పెట్టారు. సై¯Œ ్స అండ్‌ టెక్నాలజీ ద్వారానే మెరుగైన, సంతోషకరమైన జీవనం సాధ్యమవుతుందని విశ్వసించారు.  

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా మనిషికి తన పట్ల, ప్రపంచం పట్ల ఆలోచించే దృక్పథం మారుతుందన్న నెహ్రూ మాటల్ని పీవీ గుర్తుచేసేవారు. జైపూర్‌లో జరిగిన సైన్‌ ్స కాంగ్రెస్‌ వేదికపై పీవీ ప్రసంగం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ఆయన దార్శనికతకు నిదర్శనం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా మార్గాలు అన్వేషించాలని ఈ వేదికపై నుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. పూర్వకాలంలోనే మన వద్ద మెరుగైన సాంకేతిక నైపుణ్యం ఉందని చెబుతూ పలు ఉదాహరణల్ని పేర్కొన్నారు. రాజస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ కాలువల ద్వారా జరుగుతున్న సమర్థ నీటి పారుదల ఇందుకు నిదర్శనమని చెప్పారు. భూమి ఉపరితలం మీదనే కాకుండా భూగర్భంలోనూ నీటి ప్రవాహం ఉంటుందని మన పూర్వీకులకు తెలుసుననీ; అలాంటి విజ్ఞానానికి రిమోట్‌ సెన్సింగ్‌ పరిజ్ఞానం కూడా తోడయితే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు.

గత వైభవం నుంచి మనం స్ఫూర్తి పొందుతున్నట్టుగానే వర్తమానంలో మనం చేసే కృషి నుంచి భావితరాలు స్ఫూర్తి పొందేలా విజ్ఞాన సంపద పెరగాలని చెప్పారు. శాటిలైట్, మిస్సైళ్లను ప్రయోగించడంలో భారత్‌ విజయాలు ఇందుకు నిదర్శనమని వివరించారు. న్యూక్లియర్‌ రియాక్టర్లు, కమ్యూ నికేషన్, రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్, గైడెడ్‌ మిస్సైళ్ల తయా రీలో భారత్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. ఇంతటి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి ఎలా సాధించవచ్చు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా దొరకాల్సి ఉందని అన్నారు.

శాస్త్ర, సాంకేతికత ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం గురించి ఆలోచించాలని శాస్త్రవేత్తలకు సూచిస్తూనే పీవీ తన మదిలోని ఆలోచనల్ని పంచుకున్నారు. భారత్‌ నుంచి ఎగుమతుల్లో వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, జౌళి, వస్త్రాలు, జెమ్స్, నగలు, తోలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌ అండ్‌ డీ, టెక్నాలజీ ద్వారా ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ఎగు మతుల్లో పురోగతి అవసరమని ఉద్ఘాటించారు. ‘దేశంలో ఏటా ధాన్యం, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల విలువ ప్రోత్సాహకరంగా ఉన్నా ఆహార తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌కు మిషనరీ అవసరం. వస్త్ర, తోలు, గని పరిశ్రమల స్థితి కూడా ఇలాగే ఉంది. తగిన టెక్నాలజీ ఉంటే ఉత్పత్తులను వ్యాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌గా తయారు చేయవచ్చు. దేశంలోని పారి శ్రామిక ఉత్పత్తుల్లో చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యం 40 శాతం ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రంగానికి టెక్నాలజీ తోడయితే చిన్న తరహా  పరిశ్రమలు అద్భుత ప్రగతి సాధించగలుగుతాయి’ అని చెప్పారు.  

పశ్చిమ దేశాలైనా, జపాన్‌లో అయినా ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరి గింది. ఇది భారత్‌లోనూ జరగాల్సి ఉందని అన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్‌ అండ్‌ డీ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందని కూడా చెప్పారు. ఇందులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం 15 శాతం కంటే తక్కువే. రీసెర్చ్‌ అండ్‌ డెవ లప్‌మెంట్‌ రంగంలో మెరుగైన మార్పులు సంభవించనున్నా యని ఆనాడే అంచనా వేశారు. భారత్‌ సాంకేతికంగా బల మైన దేశంగా ఎదగాలంటే ఆర్‌ అంyŠ డీ అనేది కేవలం పరిశ్రమల్లోనే కాకుండా విశ్వవిద్యాలయాల్లోనూ జరగాల్సిన అవసరం ఉందని 27 ఏళ్ల క్రితమే పీవీ చెప్పారు. యూని వర్సిటీల్లో జరిగే ప్రయోగాల కోసం పరిశ్రమలు పెట్టుబ డులు పెట్టాలని సూచించారు. 1986లో తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలోనూ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధాన ఆవశ్యకతను పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సై¯Œ ్స అండ్‌ టెక్నాలజీ ద్వారా ఆర్థిక ప్రగతి సాధించి, సంపద సృష్టించాలని పీవీ చెప్పారు. సృష్టించిన సంపద న్యాయబద్ధమైన పంపిణీ జరిగినప్పుడే ప్రతి ఒక్క రిలో సంతోషం కనిపిస్తుందని చెప్పిన దార్శనికుడు పీవీ.

పి.వి. ప్రభాకరరావు
వ్యాసకర్త పీవీ తనయుడు
(ఇది పీవీ శతజయంతి సంవత్సరం)

 

Advertisement

తప్పక చదవండి

Advertisement