Sakshi Guest Column On Atiq Ahmed And Ashraf Assassinations - Sakshi
Sakshi News home page

ఈ హత్యల వెనుక ప్రశ్నలు ఎన్నో!

Published Mon, Apr 24 2023 3:15 AM

Sakshi Guest Column On Atiq Ahmed and Ashraf Assassinations

అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య కేసులో విచారణ ముందుకు సాగితే కనుక... ఆ విచారణ వార్తలను రానున్న కొద్ది వారాల్లో మీడియాలో చదువుతున్నప్పుడు, లేదా చూస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నల్ని మీ మదిలో మెదలనివ్వండి. జరిగింది ఏమిటన్న దానికి మనం దగ్గరవుతున్నామా లేక తప్పుదారి పడుతున్నామా అనే విషయాన్ని ఆ ప్రశ్నలు మీకు తెలియజేస్తాయి. సమాధానాలతో ప్రమేయం లేకుండా ప్రశ్నల
కుండే ప్రాధాన్యం ప్రశ్నలకు ఎప్పుడూ ఉంటుంది.

ఏం జరిగిందన్న విషయమై వాస్తవాన్ని రాబట్టేందుకు అదనంగా... ఎందుకు, ఎలా జరిగిందన్నది తెలుసుకునేందుకు మాత్రమే ముఖ్యం అయిన ప్రశ్నలు కాకపోవచ్చవి. రెండవ ముఖ్యమైన కారణం కూడా ఉంటుంది. జస్టిస్‌ లోకూర్‌ అన్నట్లు... ‘‘మునుపు ఎన్‌కౌంటర్‌ మరణాలు ఉంటుండగా... పోలీసు కస్టడీలో జరిగిన అతీక్, అష్రాఫ్‌ల హత్యలు బహుశా మొదటిసారి బయటి వ్యక్తులు చేసినవి.’’ అందుకే అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి.

బహుశా ఇది సందేహాస్పదమైన ప్రామాణికత గల కథోపాఖ్యానం వంటిది కావచ్చు. తాత్వికు రాలు గెర్‌ట్రూడ్‌ స్టెయిన్స్‌ మరణశయ్యపై ఉండి నప్పుడు... ‘‘సమాధానాలు ఏమిటి?’’ అని (ఆమె భర్త) ఆమెను అడిగారట. అప్పుడు ఆమె తీవ్ర ప్రయత్నంతో తనను తాను కూడదీసుకుని, ‘‘మొదట ప్రశ్నలేమిటో అడగండి!’’ అన్నారట! ఆమె ప్రశ్న స్పష్టమైనది, సరళమైనది. మీరు అడ గడమే తప్పుగా ప్రశ్నలు అడిగితే మీరు ఎన్నటికీ నిజం ఏమిటన్న దానిని పొందలేరు. పోలీసు కస్టడీలో అత్యంత భయానకంగా, నిర్దాక్షిణ్యంగా, వ్యవస్థకే తలవంపుగా జరిగిన అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య కేసు విచారణలో కూడా ఇదే రకమైన ప్రశ్నల ఆలోచనా విధానం ప్రధానంగా ఉండాలి.  
 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రఖ్యాతి గాంచి, పదవీ విరమణ పొందిన వారిలో ఒకరైన జస్టిస్‌ మదన్‌ లోకూర్‌తో నేను జరిపిన సంభా షణలో ఆయన లేవనెత్తిన అనేక చిక్కుముడి ప్రశ్నలను ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చాలా విషయాల్లో జరిగిన తప్పులను ఎత్తిచూపిన ప్రశ్నలవి. అందుకే అవి సత్యానికి తోవ చూపే జాడలు. అతీక్, అష్రాఫ్‌ల హత్య కేసు విచా రణ, విచారణ ఫలితాల వెల్లడింపు వార్తలను రానున్న కొద్ది వారాల్లో మీరు చదివేటప్పుడు ఈ ప్రశ్నలను మదిలో ఉంచుకోండి. జరిగింది ఏమి టన్న దానికి మనం దగ్గరవుతున్నామా లేక తప్పు దారి పడుతున్నామా అనే విషయాన్ని ఆ ప్రశ్నలు మీకు తెలియజేస్తాయి. 

మొదటి ప్రశ్న. రాత్రి గం.10.30 సమయంలో అతీక్, అష్రాఫ్‌ సోదరులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? ‘ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌’ చెబుతున్న దానిని బట్టి అతీక్, అష్రాఫ్‌లను ఉంచిన నైనీ జైలు తలుపులను విధిగా సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. వైద్య చికిత్స అందించ వలసిన అత్యవసర పరిస్థితి లేనప్పుడు జైలు వేళల్ని ఉల్లంఘించి మరీ ఎందుకు వారిద్దరినీ బయటికి తీసుకువచ్చారు? వారి పోలీసు కస్టడీ ముగియడా నికి మర్నాడు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నప్పుడు, వారిని ఆదివారం ఉదయం వైద్య పరీక్షలకు తీసుకెళ్లి ఉండవచ్చు కదా! అంతవరకు ఎందుకు ఆగలేదు?

రెండవది. వాళ్ళిద్దర్ని తీసుకెళుతున్న పోలీస్‌ జీపు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆసుపత్రి బయట ఉన్న మైదానంలోనే ఎందుకు ఆగిపోయింది? ఆసుపత్రి లోపల పార్కింగ్‌కి చోటు ఉన్నప్పుడు వాళ్లను బయటే దింపి, లోపలికి నడి పించుకుని వెళ్లవలసిన అవసరం ఏముంది? నిజానికి అలా చేయడం అనవసరంగా ప్రమాదా నికి తావు కల్పించడమే!

మూడవది. ఆ ఇద్దర్నీ చుట్టుముట్టి ప్రశ్నలు అడిగేందుకు మీడియాను ఎందుకు అనుమతించారు? అయినా రాత్రి 10.30కి వారిని వైద్య పరీ క్షలకు తీసుకెళుతున్నట్లు మీడియాకు ఎలా తెలిసింది? ఏ ఆసుపత్రికి తీసుకెళుతున్నారో వాళ్లెలా తెలుసుకోగలిగారు? ఎవరైనా సమాచారం అందించారా? అయితే ఆ అందించిన వారెవరు?

నాల్గవది. రాత్రి పూట అతీక్, అష్రాఫ్‌లను వైద్య పరీలకు తీసుకెళుతున్నట్లు హంతకులకు ఎలా తెలుసు? ఏ ఆసుపత్రికి తీసుకెళుతున్నారో వాళ్లెలా కనిపెట్టగలిగారు? హంతకులు న్యూస్‌ కెమెరా మన్‌ల వేషంలో వచ్చారంటే మీడియా అక్కడికి వస్తుందని ముందే వారికి ఎలా తెలిసింది? ఎవరైనా ఉప్పందించారా? అందిస్తే ఎవరు?

ఐదవది, ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ చెబుతున్న ప్రకారం 22 సెకన్ల పాటు కాల్పులు కొనసాగాయి. ఆ వ్యవధిలో 14 రౌండ్ల కాల్పులు జరిగాయి. హత్యకు పాల్పడిన ముగ్గురూ వృత్తి ప్రావీణ్యం గలవారిలా కనిపించారని కూడా ఆ పత్రిక రాసింది. అంటే హంతకులు తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందినవారా? 7 లక్షల రూపాయల ఖరీదైన టర్కీ పిస్టల్‌ వారిలో ఒకరి చేతికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్న మరింత ముఖ్యమైనది... టర్కీ పిస్టల్స్‌ని ఇండియా నిషేధించడం కనుక నిజమైతే!

ఆరవది. ఎస్కార్ట్‌ పోలీసులు ఆయుధాలు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే, వాళ్లెందుకు తిరిగి కాల్పులు జరపలేదు? ఆయుధాలు లేకుంటే ఎందుకు లేవు? అతీక్‌ను చంపేస్తామనే బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయనీ, అతడికి సాయుధ భద్రత అవసరం అనీ వారికి నిర్ధారణగా తెలిసి కూడా ఎందుకు భద్రతను కల్పించలేదు? భద్రతను అందించకపోవడం నేరపూరితమైన బాధ్యతారాహి త్యంతో సమానం కదా?

ఏడవ ప్రశ్న. హంతకులను పోలీసులు ఎందు కని పోలీస్‌ కస్టడీకి ఇవ్వమని అడగలేదు? బదు లుగా జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఎందుకు సమ్మతించారు? హంతకులను ప్రశ్నించి, తదుపరి విచారణ జరపవలసిన అవసరం లేదా? అవసరం లేదను కుంటే, పోలీసులకు ముందే అంతా తెలుసు కనుక... తెలుసుకోడానికి కస్టడీకి తీసుకోవలసిన అవసరం ఏముంది అనే సంకేతం రావడం లేదా? అదే నిజమైతే వారికి ప్రతిదీ ఎలా తెలుసు(ఎందుకు తెలుస్తోంది అని కూడా) అనే ప్రశ్న వస్తుంది. 

ఏం జరిగిందన్న విషయమై వాస్తవాన్ని రాబట్టేందుకు అదనంగా... ఎందుకు, ఎలా జరిగిందన్నవి తెలుసుకునేందుకు మాత్రమే ఇవి ముఖ్య మైన ప్రశ్నలు కావు. రెండవ ముఖ్యమైన కారణం కూడా ఉంది. జస్టిస్‌ లోకూర్‌ అన్నట్లు... ‘‘మునుపు ఎన్‌కౌంటర్‌ మరణాలు ఉంటుండగా... పోలీసు కస్టడీలో గత శనివారం రాత్రి (ఏప్రిల్‌ 15) అతీక్, అష్రాఫ్‌లపై జరిగినవి బహుశా మొదటిసారి బయటి వ్యక్తులు చేసిన హత్యలు.’’ ఇలా జరగడమే భయానకం, కలవరపాటు, సిగ్గు చేటు. 

ఇలా మళ్లీ జరగకుండా చూసుకోవాలి.లేదంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చాటుకునే మన ప్రగల్భాలు– ‘ప్రజాస్వామ్యా నికి తల్లి వంటిది’ అనే తక్కువ సమర్థనీయమైన మాటనైతే పక్కన పెట్టేయండి – నకిలీలా, బోలుగా ధ్వనిస్తాయి. అందుకే జస్టిస్‌ లోకూర్‌ ప్రశ్నలు ముఖ్యమైనవి.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement