స్లిప్పులతో పాటు ‘ఓటర్‌ గైడ్‌’ | Sakshi
Sakshi News home page

స్లిప్పులతో పాటు ‘ఓటర్‌ గైడ్‌’

Published Thu, Nov 16 2023 6:27 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్న ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్స్‌తో పాటు ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహగాన కల్పించేలా ‘ఓటర్‌ గైడ్‌’ బుక్‌లెట్స్‌ కూడా అందజేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,119 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 45 లక్షలకు పైగా ఓటర్లున్నారని, వారందరికీ ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్స్‌తో పాటు బుక్‌ లెట్లను కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఓటరు స్లిప్పులో ఓటరు పేరు, పోలింగ్‌ కేంద్రం నెంబర్‌, బుక్‌లెట్‌లో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఓటింగ్‌ లో పాల్గొనే విధానంపై అవగాహన కల్పించేలా వివరాలు ఉంటాయని తెలిపారు.

Advertisement
Advertisement