Sakshi News home page

మాస్కో ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన అమెరికా !

Published Sat, Mar 23 2024 9:13 AM

America Warned Russia About Moscow Attacks  - Sakshi

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించే అవకాశాలున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి ఆడ్రియెన్‌ వాట్సన్‌ వెల్లడించారు.

‘ఈ నెల మొదట్లో అమెరికా ప్రభుత్వానికి మాస్కో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందింది. ప్రజలు గుమిగూడి ఉన్న ప్రదేశాల్లో ఈ దాడి జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో వెంటనే రష్యాలో ఉన్న అమెరికాన్లకు అడ్వైజరీ కూడా జారీ చేశాం. డ్యూటీ టు వార్న్‌ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వంతోనూ పంచుకున్నాం’అని వాట్సన్‌ తెలిపారు.

మాస్కో శివార్లలో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు గ్రెనేడ్‌ కూడా విసిరారు. ఈ కాల్పుల్లో 62 మంది మృతి చెందగా మరో 100 మంది దాకా గాయపడ్డారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పటికే ప్రకటించింది.

 

ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్‌ మారణహోమం

Advertisement

తప్పక చదవండి

Advertisement