ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం

Published Sat, Jan 13 2024 7:40 AM

Bat symbol case: Pakistan CJ Says SC wont Take Over EC job - Sakshi

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌– ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ)కు బ్యాట్‌ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని సీజేపీ జస్టిస్‌ క్వాజీ ఫయీజ్‌ ఇసా పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించడం, దానిపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. దీనిపై పీటీఐ పెషావర్‌ హైకోర్టును ఆశ్రయించగా, ఊరట లభించింది.

అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్‌ హైకోర్టు తప్పుపట్టింది. బ్యాట్‌ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా సీజేపీ జస్టిస్‌ ఇసా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంది.

ఈసీ తన బాధ్యతలను నిర్వరిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సరైన చర్య అవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement