కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు | Sakshi
Sakshi News home page

కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు

Published Fri, Aug 19 2022 5:15 AM

Covid patients at higher risk of psychiatric, neurological conditions after two years - Sakshi

లండన్‌: కోవిడ్‌ రోగుల్లో రెండేళ్ల తర్వాత కూడా మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ 12.5 లక్షల మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను లాన్సెట్‌ సైక్రియాట్రి జనరల్‌ తన తాజా సంచికలో ప్రచురించింది.

కరోనా సోకినప్పుడు శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో పాటుగా రెండేళ్ల వరకు సైకోసిస్, డిమెన్షియా, బ్రెయిన్‌ ఫాగ్‌ వంటి కొనసాగుతున్నాయని అధ్యయనం తేల్చింది. చిన్నారుల్లో కంటే పెద్దవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు కోవిడ్‌ సోకిన మొదటి ఆరు నెలల్లోనే వచ్చి రెండేళ్ల వరకు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ పాల్‌ హరిసన్‌ వివరించారు. 

Advertisement
Advertisement