Earthquake in Indonesia: 7.0 Magnitude Earthquake Hits Indonesia - Sakshi
Sakshi News home page

ఇండోనేషియా జావాను కుదిపేసిన భారీ భూకంపం

Published Fri, Apr 14 2023 7:31 PM

Earthquake today:7 Magnitude Earthquake Hits Indonesia Java - Sakshi

జకార్తా: భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఉత్తర ప్రాంతం వైపుగా జావా ద్వీపాన్ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్‌ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(USGS) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

శుక్రవారం సాయంత్రం భారీ ప్రకంపనలు జావా చుట్టుపక్కల కుదిపేశాయి. అయితే.. భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతం కావడంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. సురబయ, టుబాన్, డెన్‌పాసర్, సెమరాంగ్‌లలో ప్రకంపనల తీవ్రత స్పష్టంగా కనిపించిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నష్టంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారాయన. 

ఇదిలా ఉంటే.. USGS భూకం తీవ్రత 7గా నమోదు చేయగా.. మరోవైపు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మో లాజికల్ సెంటర్ (EMSC) భూకంపం 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది.

Advertisement
Advertisement