Covid 19: Omicron Variant First Death Reported in UK - Sakshi
Sakshi News home page

ప్రపంచంలో తొలి ‘ఒమిక్రాన్‌’ మరణం

Published Mon, Dec 13 2021 6:05 PM

First UK Death Recorded With Omicron Variant - Sakshi

First UK Death Recorded With Omicron Variant: ప్రపంచంలో తొలి ఒమిక్రాన్‌ మరణం బ్రిటన్‌లో నమోదైందని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం ప్రకటించారు. పశ్చిమ లండన్‌లోని టీకా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా బోరిస్‌ మీడియాతో మాట్లాడారు. ‘ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పోరు సందర్భంగా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. బిటన్‌పై భీకర ఒమిక్రాన్‌ అల విరుచుకుపడబోతోంది. వయోజనులకు రెండు డోస్‌ల సంరక్షణ ఏమాత్రం సరిపోదు.  డిసెంబర్‌ 31కల్లా అందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి’ అని బోరిస్‌ స్పష్టంచేశారు.

ఇక్కడ చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకుంటావా!

లండన్‌లో నమోదవుతున్న కేసుల్లో 40శాతం కేసులు ఒమిక్రాన్‌వేనని ఆయన వెల్లడించారు. బ్రిటన్‌లో బూస్టర్‌ డోస్‌లకు డిమాండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పెరగడంతో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ టీకా  బుకింగ్‌ వెబ్‌సైట్‌ కుప్పకూలింది. దీంతో వయోజనులు టీకా కేంద్రాల వద్ద బారులుకట్టారు.  ‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంది. ప్రతీ రెండు మూడ్రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది’ అని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్‌ తాజా కఠిన నిబంధనలపై మంగళవారం పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనుంది.

కోరలు చాస్తున్న ఒమిక్రాన్‌! ఈ దేశాల్లో చేయిదాటుతోన్న పరిస్థితి..!

ఆదివారం కొత్తగా 1,239 ఒమిక్రాన్‌ కేసులొచ్చాయి. దీంతో మొత్తం 48వేల కేసుల్లోఒమిక్రాన్‌ కేసులు 3,137 దాటాయి. బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కట్టడిచేసేలా కొత్త కఠిన చర్యలు తీసుకోకుంటే మరణాలు భారీగా పెరుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. జనవరిలో ఈ వేరియంట్‌ వ్యాప్తి పెరిగి ఏప్రిల్‌కల్లా 25వేల నుంచి 75 వేల మంది కోవిడ్‌తో మరణించే ప్రమాదముందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ – ట్రోపికల్‌ మెడిసిన్‌ హెచ్చరించింది. బ్రిటన్‌లోని వైద్య గణాంకాలను తీసుకుని ఈ అధ్యయనం చేశారు.

Advertisement
Advertisement