Indian National Pleads Guilty In Human Smuggling From Canada To US - Sakshi
Sakshi News home page

కెనడా మానవ అక్రమ రవాణా కేసులో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష..  

Published Tue, Aug 1 2023 8:43 AM

Indian National Pleads Guilty In Human Smuggling From Canada To US - Sakshi

న్యూయార్క్: కెనడాలోని ఒంటారియో నివాసముంటున్న భారతీయుడు సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) మానవ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష. 250,000 జరిమానా విధించింది అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.  సింగ్ మొదటగా ఆరుగురిని అక్రమ రవాణా చేయగా న్యూయార్క్ లో ఉండగా మరో ముగ్గురిని అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించాడు. యూఎస్ అభ్యర్ధన మేరకు సింగ్ ను 2022 జూన్ 28న కెనడాలో అరెస్టు చేశారు. తర్వాత అమెరికా తరలించారు. 

ఈ ఏడాది మార్చిలో అతడిని విచారణ నిమిత్తం కెనడా నుండి అమెరికా రప్పించారు. విచారణలో మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యలో అతను అనేక మంది భారతీయులను కెనడా నుండి కార్న్ వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు తేలింది. అతడు మానవ రవాణాకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకునేవాడని తేలింది.  

నిందితుడు సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా అమెరికాకు తరలించే వాడని తెలిపారు అల్బనీ పోలీసులు. గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను గుర్తించామని, అప్పుడే ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చినట్లు అల్బనీ పోలీసులు తెలిపారు.     

కొంతమంది అక్రమ వలసదారులు అమెరికన్ లా ఎన్ఫోర్స్ మెంట్ వారికి సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే సింగ్ బాధితుల వద్ద నుండి 5000 నుండి 35000 డాలర్ల వరకు వసూలు చేసేవాడని తేలింది. ఈ నేరారోపణలన్నిటిలోనూ సింగ్ దోషిగా తేలడంతో న్యూయార్క్ అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి మెయ్ ఏ.డి. ఆగోష్ఠినో నిందితుడికి మొదట ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ దీన్ని 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని అన్నారు. జైలు శిక్ష తోపాటు సింగ్ కు 250,000 యూఎస్ డాలర్ల జరిమానా కూడా విధించారు. జైలు శిక్ష డిసెంబర్ 28, 2023 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చారు.   

ఇది కూడా చదవండి: గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..

Advertisement
Advertisement