సౌత్‌ కొరియా ఆక్రమణే లక్ష్యం​: కిమ్‌ | Sakshi
Sakshi News home page

సౌత్‌ కొరియా ఆక్రమణే లక్ష్యం​: కిమ్‌

Published Tue, Jan 16 2024 3:26 PM

Kim Sensational Speech In North Korea Parliament - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు నార్త్‌ కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాల  మధ్య బలపడుతున్న సంబంధాల వల్లే  కిమ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 

‘దక్షిణ కొరియాతో కలవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం.  మన రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. దక్షిణ కొరియా మన ప్రధాన శత్రువని రాబోయే తరాలకు తెలియజేయాలి. దక్షిణ కొరియాను ఆక్రమించుకునేందుకు మనం ప్రణాళిక రచించాలి.

రెండు దేశాల మధ్య ఇక ఎలాంటి సమాచార పంపిణీ ఉండకూడదు. ప్యాంగ్‌యాంగ్‌లో ఉన్న కొరియా పునరేకీకరణ ఐకాన్‌ను ధ్వంసం చేయండి. కొరియా దేశాల పునరేకీకరణ కోసం పని చేస్తున్న సంస్థను మూసేయండి. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని వెంటనే ఆపండి’ అని  నార్త్‌ కొరియా  పార్లమెంట్‌లో కిమ్‌ ప్రసంగించారు.  

ఇదీచదవండి.. నౌకలపై దాడులతో ఇంధన సరఫరాపై ప్రభావం

Advertisement
Advertisement