Sakshi News home page

పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..

Published Sun, Mar 10 2024 9:12 AM

Pakistan Fruit vegetable Costs Surge Before Ramadan - Sakshi

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్‌లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రస్తుతం పాకిస్తాన్‌లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ  50 పీకేఆర్‌ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్‌ నుండి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్‌ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్‌లకు చేరింది. 

సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్‌ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 పీకేఆర్‌లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్‌లకు అమ్ముతున్నారు. 

Advertisement
Advertisement