ఉక్రెయిన్‌లో మారణ హోమం.. 26 లక్షల మంది శరణార్థులున్న స్థావరంపై.. | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో మారణ హోమం.. మానవత్వం మరచిన రష్యన్‌ బలగాలు

Published Sun, Mar 13 2022 5:54 PM

Russian Forces Air Strikes On Lviv Military Base - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో భయాకన వాతావరణాన్ని సృష్టించాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా సైన్యం. తాజాగా రష్యా బలగాలు మరో మారణహోమాన్ని సృష్టించాయి. 

రష్యా బలగాలు పశ్చిమ ఉక్రెయిన్‌కు విస్తరిస్తున్న క్రమంలో తాజాగా పోలాండ్‌ సరిహద్దుల్లోని ల్వీవ్‌ వద్ద ఉక్రెయిన్‌ సైనిక శిక్షణ స్థావరంపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో 35 మంది మరణించగా 134 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ల్వీవ్‌ ఒకటిగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ల్వీవ్‌లో దాదాపు 26 లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఆదివారం జరిగిన దాడితో వారిలో ఆందోళన మొదలైంది. 

మరోవైపు రష్యా బలగాలు మరో ఘాతుకానికి ఒడిగట్టాయి. ద్నిప్రోరుడ్నే మేయర్‌ యెవెన్ మాట్వీవ్‌ను అపహరించినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా ట‍్విట్టర్‌ వేదికగా తెలిపారు. స్థానికుల నుంచి సహకారం లేకపోవడంతో రష్యన్‌ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్‌పై భయానక దాడులను నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇది చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..!

Advertisement
Advertisement