పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన

Published Fri, Nov 10 2023 5:22 AM

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు, అధికారులు - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు అభయ్‌నందన్‌ అభస్తా అన్నారు. గురువారం జంగేడు, వేశాలపల్లి పరిధిలోని 48, 58 పోలింగ్‌ కేంద్రాలను ఆయన తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్‌, నోడల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. తాగునీరు, టాయిలెట్‌, మంచి వెలుగు, కరెంట్‌ సౌకర్యం, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, సహాయార్థం అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బూత్‌స్థాయి అధికారులను ఆదేశించారు. నూతన ఓటర్లకు ఓటువేసే ప్రక్రియ సులభంగా అర్థమయ్యే విధంగా ఓటర్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు, ఈవీఎం వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, సాధారణ పరిశీలకులు ఉన్నారు.

Advertisement
Advertisement