ఆదివాసీ చట్టాలపై అవగాహన తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఆదివాసీ చట్టాలపై అవగాహన తప్పనిసరి

Published Fri, Nov 17 2023 1:26 AM

సమావేశంలో మాట్లాడుతున్న శ్రావణ్‌ - Sakshi

ఏటూరునాగారం: ఆదివాసీ చట్టాలపై రాజకీయ నాయకులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబ్బాక శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఆదివాసీ చట్టాలపై, భారత రాజ్యాంగంపై ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఉన్నత విద్యావంతులుగా చెప్పుకునే నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆదివాసీ చట్టాలను సవరిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేని నాయకులకు చట్ట సభల్లో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే హై కోర్టును ఆశ్రయించి పోడు భూములకు హక్కు పత్రాలు సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోరం నాగేశ్వరరావు, పొదెం నాగేశ్వరరావు, కోరం మోహన్‌ రావు, పొదెం సాగర్‌, జోగ వేణు, అంజి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement