మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Wed, Nov 22 2023 1:46 AM

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌   - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్‌ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భవేష్‌మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన 396 అదనపు బ్యాలెట్‌ యూనిట్లు ఎన్‌ఐసీ రూపొందించిన సాఫ్ట్‌ వేర్‌ వినియోగిస్తూ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి ఈవీఎం గోదాం భద్రతను పరిశీలించినారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్‌ అధికారుల పాత్ర కీలకమని, బాధ్యతాయుతంగా సిబ్బంది సమన్వయంతో నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కాలేజీలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల విధులపై మాస్టర్‌ ట్రైనర్స్‌ చే నిర్వహించిన 2వ లెవెల్‌ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా పాల్గొన్నారు. పీపీటీ ద్వారా శిక్షణ తరగతుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓటింగ్‌ ప్రారంభంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాక్‌ పోలింగ్‌ నిర్వహించే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత పోలింగ్‌ అధికారులు ఫామ్‌ 22ను క్లుప్తంగా ఒకటికి 10 సార్లు చదివి తప్పులు లేకుండా సరిచూసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ పొందే అధికారులు, సందేహాలు ఉంటే మరోసారి అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరూ కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.

జిల్లా ఎన్నికల అధికారి భవేష్‌ మిశ్రా

Advertisement
Advertisement