Sakshi News home page

20న వికాసలో జాబ్‌మేళా

Published Sat, Mar 18 2023 2:20 AM

-

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈనెల 20న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో ఖజానా జ్యూయలరీలో సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్స్‌, క్యాషియర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, శ్రీనికేతన్‌ షాపింగ్‌ మాల్‌లో బిల్లింగ్‌, క్యాషియర్‌, సూపర్‌వైర్లకు, డీ–మార్ట్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌, క్యాషియర్‌లకు, నిట్‌ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ పేర్కొన్నారు. డెక్కన్‌ కెమికల్స్‌లో ట్రైనీ, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో లోడర్స్‌, డ్రైవర్స్‌, వీల్‌మార్ట్‌ ఆటో ఫైనాన్స్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌, మెకానిక్‌ హెల్పర్‌, ఐనాక్సలో ఆపరేషన్‌ అసోసియేట్స్‌, అమెజాన్‌లో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటిఐ, డిప్లామో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 40 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.10 వేలు నుంచి రూ.25 వేలు వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయానికి ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌ కాపీలతో హాజరు కావచ్చని లచ్చారావు వివరించారు.

Advertisement

What’s your opinion

Advertisement