Sakshi News home page

శ్రీపీఠం.. భక్తజనసంద్రం

Published Mon, Nov 20 2023 2:44 AM

లలితా కుంకుమార్చనల్లో వేలాదిగా పాల్గొన్న భక్తులు         శ్రీపీఠంలో దీపోత్సవ కాంతులు  - Sakshi

కాకినాడ రూరల్‌: మహాశక్తియాగం జరుగుతున్న కాకినాడ రమణయ్యపేటలోని శ్రీపీఠం భక్తజనసంద్రంగా మారుతోంది. ఈ మహాయాగానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ పర్యవేక్షణలో ఈ యాగం ఈ నెల 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. యాగంలో భాగంగా అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్న ఆదిపరాశక్తిని ఒకేచోట మహాశక్తిగా ఆవిష్కరించే అద్భుత ఘట్టంగా శతకోటి లలితా కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. రోజూ 10 వేల నుంచి 12 వేల మందితో నెల రోజుల పాటు కుంకుమార్చనలు నిర్వహించాలని తలపెట్టారు. అయితే 15 వేలకు మందికి పైగా మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. యాగం ఆరో రోజైన ఆదివారం యాగశాలలో ఉదయం నక్షత్ర పూజ, తిథి దేవత పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన లలితా కుంకుమార్చనలకు పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు పురుషులు కూడా హాజరయ్యారు. మూడుసార్లు లలితా నామార్చనలతో కుంకుమార్చనలు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేశారు. దీనికోసం వలంటీర్లు శ్రమిస్తున్నారు. దీపోత్సవ వేదికపై సాయంత్రం శోభారాజ్‌ బృందం ఆలపించిన కర్నాటక సంగీతం శ్రోతలను అలరించింది. పార్వతీ పరమేశ్వరులను పల్లకీ సేవతో ఊరేగింపుగా దీపోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చిన అనంతరం పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం భక్తుల చేతులు మీదుగా దీపోత్సవం చేశారు. దీపకాంతులతో శ్రీపీఠం వెనుక ఉన్న గోశాల ప్రాంగణం వెలుగులతో నిండిపోయింది.

Advertisement

What’s your opinion

Advertisement