మొత్తం పది మండలాలు.. | Sakshi
Sakshi News home page

మొత్తం పది మండలాలు..

Published Thu, Oct 26 2023 7:34 AM

- - Sakshi

మొత్తం పది మండలాలు..

ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలా బాద్‌ లోకసభ పరిధిలోకి వస్తుంది. ఆసిఫాబా ద్‌ పాత నియోజకవర్గం(ఎస్సీ– 244)లో ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, తాండూర్‌, రెబ్బెన, తి ర్యాణి, వాంకిడి, భీమిని మండలాలు ఉండేవి. పునర్విభజన తర్వాత బెల్లంపల్లి, తాండూరు, భీమిని మండలాలతో బెల్లంపల్లి ని యోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతమున్న ఆసిఫాబాద్‌(ఎస్టీ– 005) నియోజకవర్గంలో ఆది లాబాద్‌ జిల్లాలోని రెండు మండలాలు(నా ర్నూర్‌, గాదిగూడ)తో కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి, ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి మండలాలు ఉన్నా యి. తొలుత ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. 1957లో జి.నారాయణరెడ్డి, 1962లో కోట్నాక భీంరావు, 1967లో కోట్నాక భీంరావు, 1972లో కోట్నాక భీంరావు, 1978లో దాసరి నర్సయ్య వరుసగా ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. తర్వాత తెలుగుదేశం ప్రభజనంలో ఇక్కడ 1983, 1985లో సీపీఐ తరఫున గుండా మల్లేశ్‌ రెండుసార్లు గెలుపొందారు. 1989 లో కాంగ్రెస్‌ అభ్యర్థి దాసరి నర్సయ్య గెలు పొందగా.. మళ్లీ 1994లో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌ విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పాటి సుభద్ర, 2004లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆమురాజుల శ్రీదేవి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున కోవ లక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కుపై విజయం సాధించారు. 2018లో ఆత్రం సక్కు కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కోట్నాక భీంరావు
1/6

కోట్నాక భీంరావు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ
2/6

కొండా లక్ష్మణ్‌ బాపూజీ

దాసరి నర్సయ్య
3/6

దాసరి నర్సయ్య

గుండా మల్లేశ్‌
4/6

గుండా మల్లేశ్‌

5/6

6/6

Advertisement
Advertisement