Sakshi News home page

పేపర్‌ లీకేజీ కాదు.. వ్యాపారం

Published Mon, Mar 27 2023 1:24 AM

సదస్సులో మాట్లాడుతున్న ఆకునూరి మురళి - Sakshi

హన్మకొండ: టీఎస్‌పీఎస్సీ నుంచి ఏడెనిమిది నెలల నుంచి పేపర్లు బయటకుపోతున్నాయంటే అది లీకేజీ కాదని వ్యాపారం అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆది వారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ బచావో సదస్సులో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా టీఎ స్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు బయటకు రావని అన్నా రు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాకుంటే బాధపడలేదని, ప్రశ్నాపత్రాలు విక్రయాలతో భవిష్యత్‌పై వారిలో ఆందోళన నెలకొందని, విశ్వాసం కోల్పోయారన్నారు. ఆంధ్రాతోపా టు ఇతర రాష్ట్రాల్లో సోపతులు పెంచుకుని వ్యాపారాన్ని విస్తరించుకునేందుకే బీఆర్‌ఎస్‌ను స్థాపించారని ఆరోపించారు. ఇది వరకు అవినీతి మాత్రమే జరిగేదని, ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారని కోదండరాం దుయ్యబట్టారు. వ్యాపారాల కోసం అధికారాన్ని వాడుకోవడమే రాజకీయంగా మారిందన్నారు. కేసీఆర్‌ కు టుంబం రూ.లక్షల కోట్లు సంపాదించారనే ప్రచా రం జరుగుతోంది. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఏకోణ్ముక పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమకారులుగా కావాల్సి న సిద్దాంతా న్ని, కార్యాచరణను తయారు చేసి, ప్రజల ముందుంచుందామన్నారు.

కేసీఆర్‌నుంచి విముక్తి కలిగించాలి

తెలంగాణను విధ్వంసం చేసేందుకు కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని, కేసీఆర్‌ నుంచి రాష్ట్రానికి వి ముక్తి కలిగించాలని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం వ్య వస్థాపకుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు.

పెద్దల హస్తం లేకుండా ప్రశ్నపత్రాలు

ఎలా బయటకు వస్తాయి

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

ప్రొఫెసర్‌ కోదండరాం

ఓట్లు కొని అధికారంలోకి వచ్చి దోచుకుంటున్నారు..

డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని అడిగే వరకు పాలకులు ఓటర్లను తీసుకొచ్చారని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారిణి విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులతో ఓట్లు కొని అధికారంలోకి వచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమకారుడు సంగం రెడ్డి పృథ్వీరాజు మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో రూ.కోట్లలో అవినీతి జరిగిందని, ఒక్కో ఇళ్లును రూ.3 లక్షలకు అమ్ముకున్నారని, అందుకే పేదలకు పంచడం లేదని ఆరోపించారు. ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తిరునహరి శేషు, డాక్టర్‌ జగదీష్‌, అంబటి శ్రీనివాస్‌, బొమ్మినేని పాపిరెడ్డి, రావుల జగదీష్‌ప్రసాద్‌, వేణుస్వామి, సోమ రామ్మూర్తి పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement