ప్రయోగాలపై పట్టు అవసరం.. | Sakshi
Sakshi News home page

ప్రయోగాలపై పట్టు అవసరం..

Published Fri, Mar 31 2023 1:36 AM

- - Sakshi

ప్రయోగ సమాచార సేకరణలో నైపుణ్యాలు, బొమ్మలు, నిత్య జీవితంలో వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పార్ట్‌ ఏ అంశాలను ఆప్లికేషన్‌ ఆప్రోచ్‌తో చదవాలి. చాప్టర్లను నిజజీవిత సంఘటనలో అన్వయించాలి. విషయ అవగాహనతో పాటు ప్రశ్నించటం, పరికల్పన చేయటం, ప్రయోగాలు, క్షేత్రపర్యటనలు, నైపుణ్యాలు, ప్రాజేక్టు పనుల పటాలు ద్వార లోతైన అధ్యయనం చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్‌ ప్రవాహం, రసాయన బంధం, పరిమాణ నిర్మాణం, కార్బన్‌, సమ్మేళనాలపై పట్టుసాధించాలి. పార్ట్‌ బీ కోసం ప్రతి పాఠ్యంశాలోని ముఖ్యాంశాలతో బీట్‌ బ్యాంకు తయారు చేసుకోవాలి.

– తిరుపతి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీఎస్‌ఎస్‌ దేవులవాడ

1/1

Advertisement
Advertisement