Unstoppable With NBK Season 2: అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2పై బాలయ్య, ఆహా టీం క్లారిటీ

20 Jun, 2022 15:11 IST|Sakshi

నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వచ్చిన టాక్‌షో అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే. ఈ షో ఎంతటి సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య హోస్ట్‌గా మారి అన్‌స్టాబబుల్‌ తొలి సీజన్‌ను విజయంతంగా చేశాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్‌నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్‌ డూపర్‌ హిట్టయిన అన్‌స్టాపబుల్‌ విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్‌ 2పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాబుల్‌ సీజన్‌ 2పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తెలుగు ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 6 ఎపిసోడ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు.

ఈ సందర్భంగా హోస్ట్‌ శ్రీరామ చంద్ర బాలయ్యను అన్‌స్టాబుల్‌ సీజన్‌ 2 ఎప్పుడు సార్‌? అని ప్రశ్నించాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఇదే వీడియోను ఆహా వీడియోస్‌ షేర్‌ చేస్తూ ‘త్వరలోనే అన్‌స్టాబుల్‌ టాక్‌ షో మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఈసారి ఎవరెవరు గెస్ట్‌గా రావాలనుకుంటున్నారో కామెంట్స్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో డిజిటల్‌ ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌ రాబోతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌గా ఎవరో రావాలో చెబుతూ తమ తమ అభిమాన హీరోల పేర్లను కామెంట్‌లో పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు