Amit Shah To Meet SS Rajamouli And Prabhas At Hyderabad - Sakshi
Sakshi News home page

SS Rajamouli-Amit Shah: రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా స్పెషల్ మీటింగ్!?

Published Tue, Jun 13 2023 4:36 PM

Amit Shah Will Meet SS Rajamouli And Prabhas At Hyderabad - Sakshi

మరో ఆసక్తికర భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ ఆయన రావడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ 'ఆర్ఆర్ఆర్' డైరెక్టర్ రాజమౌళితోపాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది.

(చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!? )

ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ ఆధ్వరంలో ఓ సభ జరగనుంది. దీనికోసం అమిత్ షా.. తెలంగాణకి రాబోతున్నారు. అయితే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారని తెలుస్తోంది. సంపర్క్ సే సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా నోవాటెల్ లో రాజమౌళి, ప్రభాస్ తో ఈయన ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితోపాటు మరో ఇద్దరు ప్రముఖుల్ని కూడా అమిత్ షా కలవనున్నారట. ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

రాష్ట్రాల పర్యటనల సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అమిత్‌ షా కలుస్తుంటారు. గతంలో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా.. టాలీవుడ్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, నితిన్‌తో పాటు మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో పాటు ఇతర ప్రముఖులను కలిశారు.

Advertisement
Advertisement