బిగ్‌బాస్ కోసం నాగ్‌కు చార్టెడ్ ఫ్లైట్‌

6 Oct, 2020 18:18 IST|Sakshi

అస‌లే బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ అంతంత మాత్రంగానే న‌డుస్తోంది. అలాంటి స‌మ‌యంలో ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న నాగార్జున బిగ్‌బాస్ షోకు దూరంగా ఉండ‌బోతున్నార‌ని తెగ‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కొన్ని వారాల‌పాటు నాగ్ లేకుండానే షో చూడాల్సి వ‌స్తుందా అని బిగ్‌బాస్ అభిమానులు అప్పుడే బెంగ పెట్టేసుకున్నారు. కానీ అలాంటి భ‌యాలేవీ అవ‌స‌రం లేవ‌ని నాగ్ అభ‌యం ఇస్తున్నారు. సినిమా, టీవీ రెండూ ఒక్క‌టే అంటున్నారు. వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొన్న‌ప్ప‌టికీ బిగ్‌బాస్ కోసం వీకెండ్‌లో మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు రానున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ షూటింగ్ పూర్త‌వ‌గానే తిరిగి వైల్డ్ డాగ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: దేత్త‌డి హారిక‌కు క్లాస్ పీకిన నాగ్‌)

ఇందుకు చిత్ర‌యూనిట్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ట. మ‌రోవైపు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు నాగ్ వీకెండ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయ‌న కోసం ప్ర‌త్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వినికిడి. మ‌రి ఆయ‌న‌‌ అటు బిగ్‌బాస్‌కు, ఇటు వైల్డ్ డాగ్ సినిమాకు స‌మ‌న్యాయం చేస్తారా? లేదా? అనేది చూడాలి. కాగా నాగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ "వైల్డ్ డాగ్" సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సిని‌మాలోని కీల‌క షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో 20 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు‌. ఈ నెలాఖర్లో థాయ్‌ల్యాండ్‌ ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.(చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌లో ఇక నాగార్జున కనిపించడా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు