నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్‌

25 Sep, 2020 23:20 IST|Sakshi

మూడో కెప్టెన్‌గా ఎన్నికైన‌ గంగ‌వ్వ‌

మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో వారానికో వైల్డ్ కార్డ్ ఎంట్రీ న‌డుస్తోంది. మొద‌టి వారం క‌మెడియ‌న్‌, న‌టుడు కుమార్ సాయి హౌస్‌లో అడుగు పెట్ట‌గా రెండో వారం అవినాష్ ఇంట్లోకి వ‌చ్చి చేరాడు. ఇప్పుడు ముచ్చ‌టగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్‌లో ప్ర‌వేశించింది. వ‌స్తూ వ‌స్తూనే అబ్బాయిల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ తీసుకొచ్చానంది. అదేంటో, అస‌లు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ లుక్కేసేయండి..

ప్ర‌తిజ్ఞ నుంచి త‌ప్పించుకున్న అభి, అఖిల్‌
'నాది నెక్కిలిసు గొలుసు..' అంటూ దుర్గారావు మాస్ సాంగ్‌ ఇంటి స‌భ్యులంద‌రినీ ఓ ఊపు ఊపేసింది. త‌ర్వాత‌ బిగ్‌బాస్ కంటెస్టెంట్ట్స్ ఆల‌ర్ ఆల్ మై బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్ అని అబ్బాయిలంద‌రూ ప్ర‌తిజ్క్ష చేశారు. ఇందులో అభిజిత్‌, అఖిల్ మాత్రం ఈ ప్ర‌తిజ్ఞ నుంచి త‌ప్పించుకున్నారు. బిగ్‌బాస్ నోయ‌ల్‌ను చెర‌సాల నుంచి విడుద‌ల చేశాడు. దీంతో ఇంటి స‌భ్యులు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ నోయ‌ల్‌కు ఇంట్లోకి గ్రాండ్‌ వెల్‌క‌మ్ చెప్పారు. అఖిల్ అంటే ఇష్ట‌మ‌ని, మోనాల్‌ న‌చ్చ‌ద‌ని గంగ‌వ్వ చెప్పుకొచ్చింది. గ‌త టాస్క్‌లో ఎవ‌రు ఎట్లా చేశార‌నేది అవ్వ చేసి చూపించ‌డంతో.. అవ్వ కూడా యాక్టింగ్ మొద‌లెట్టిందిరోన‌ని మాస్ట‌ర్ పంచ్ వేశాడు. (చ‌ద‌వండి: అభిజిత్ టాప్ 3లో ఉంటాడు: యాంక‌ర్ ర‌వి)

కెప్టెన్సీ పోటీదారుల‌కు రంగు ప‌డింది
బిగ్‌బాస్‌ రంగు పడుద్ది జాగ్ర‌త్త అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. టాస్క్ అయిపోయే స‌మ‌యానికి ఎవ‌రి బౌల్‌లో ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లే గెలిచిన‌ట్లు. ఇంటి స‌భ్యులంద‌రూ ప‌గ‌ప‌ట్టిన‌ట్లు అభిజిత్‌, అవినాష్, హారిక పాత్ర‌లోని నీళ్ల‌ను మొత్తం కింద ప‌డేశారు. కానీ ఏ ఒక్క‌రూ గంగవ్వ‌ను క‌నీసం ట‌చ్ కూడా చేయ‌క‌పోవ‌డంతో ఆమె కెప్టెన్ అయింది. త‌ర్వాత అంద‌రూ కాసేపు స్విమ్మింగ్‌పూల్‌లో జ‌ల‌కాలాడారు. అఖిల్‌, మోనాల్ మాట్లాడుకోవ‌డ‌ట్లేర‌ని అవ్వ గుస‌గుస‌లు పెట్టింది.

హౌస్‌మేట్స్‌పై బిగ్‌బాస్ గ‌రం
నిజంగానే త‌ర్వాత మోనాల్.. అఖిల్‌కు సారీ చెప్పింది. నేనేం పెళ్లి చేసుకోవడానికి రాలేద‌ని అఖిల్ అన‌డంతో అత‌డిని కూల్ చేసేందుకు రాత్రికి గోరుముద్ద‌లు తి‌నిపించింది. ఇక త‌న ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తున్నార‌ని బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌పై సీరియ‌స్ అయ్యాడు. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ పాయింట్లు తొల‌గించ‌డంతో పాటు రేష‌న్‌లోనూ కోత విధించాడు. దీంతో దేవి మిన‌హా మిగ‌తా కంటెస్టెంట్లు అంద‌రూ చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తూ బిగ్‌బాస్‌కు సారీ చెప్పారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఇద్ద‌రి మ‌ధ్య న‌లుగుతున్న మోనాల్‌)

క‌మెడియ‌న్ల‌కూ మ‌న‌సుంటుంది: అవినాష్‌
బుట్ట‌బొమ్మ సాంగ్‌తో స్వాతి దీక్షిత్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంట‌నే ఆమెను అభిజిత్ లోనికి తీసుకువెళ్తే, మాస్ట‌ర్ మాస్క్ తీశాడు. ఇక అవినాష్‌, మాస్ట‌ర్ ఆమెకు స‌క‌ల మ‌ర్యాద‌లు చేశారు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ అస‌లు ట్విస్ట్ ఇచ్చాడు. స్వాతి అబ్బాయిల‌కు స‌ర్‌ప్రైజ్ తీసుకొచ్చింద‌ని అది చెప్పాలంటే వారంతా ఆమెను మెప్పించాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. "అందం ఎలా ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది.. చిన్న‌ప్పుడు ఆడుకునే బొమ్మ ప్రాణంతో ఉంటుంద‌ని ఇప్పుడే చూస్తున్నాను" అంటూ ‌మాస్ట‌ర్‌ క‌విత్వం చెప్పాడు. "నువ్వు న‌వ్వితే బాగుంటావు, నేను నీ తోడుంటే జీవితాంతం న‌వ్వుతూనే ఉంటావు. బుట్టబొమ్మ కాదు.. బాపు గీసిన బొమ్మ‌వు. నీ పేరు స్వాతి దీక్షిత్‌.. నీ కోసం ఎన్ని దీక్ష‌లైనా చేయొచ్చు. సాధార‌ణంగా హీరోయిన్లు హీరోల‌కు ప‌డిపోతారు. కానీ క‌మెడియ‌న్ల‌కు ప‌డిపోరు. మాకు మ‌న‌సుంటుంది" అని అవినాష్ ప్రేమ కావ్యాలు ప‌లికాడు.

అఖిల్‌, మాస్ట‌ర్‌. నోయ‌ల్‌, అవినాష్‌తో స్వాతి పార్టీ
మెహ‌బూబ్ 100 పుష‌ప్స్ చేశాడు. అంద‌రి ప్రేమ‌ను మీపై చూపిస్తాన‌ని సోహైల్ మాటిచ్చాడు. అఖిల్‌, అభిజిత్‌, నోయ‌ల్ పాట పాడ‌గా కుమార్ సాయి డ్యాన్స్ చేశాడు. అనంత‌రం స్వాతి. అయితే వీరంద‌రిలో త‌న‌ను మెప్పించిన‌ అఖిల్‌, మాస్ట‌ర్‌, నోయ‌ల్‌, అవినాష్‌కు ఎర్ర గులాబీలు ఇచ్చింది. ఆ త‌ర్వాత స‌ర్‌ప్రైజ్ రివీల్ చేశారు. ఈ న‌లుగురితో క‌లిసి స్వాతి ఓ ప్ర‌త్యేక గదిని ఓపెన్ చేసి గ్రాండ్‌ పార్టీ చేసుకున్నారు. మిగ‌తా ఇంటి స‌భ్యులు పార్టీ మిస్స‌య్యామ‌ని చాలా ఫీల‌య్యారు. (చ‌ద‌వండి: నోయ‌ల్‌కు రోజంతా రాగి జావ మాత్ర‌మే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు