రౌడీ హీరోను కలిసిన అభిజిత్‌

28 Dec, 2020 08:50 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్‌ చేయగలిగే నైపుణ్యం, హుందాగా మాట్లాడే వైఖరి, అన్నింటికీ మెంచి తెలివి.. అతడికి విజయాన్ని తెచ్చి పెట్టాయి. అయితే షో నుంచి బయటకు వచ్చాక తనకు వస్తున్న మద్దతు చూసి అభి ఆశ్చర్యపోయాడు. అభిమానుల కురిపిస్తున్న ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు. హౌస్‌లో అతడు వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్‌ మాత్రమే కాదు సెలబబ్రిటీలు కూడా మంత్రముగ్దులవడం విశేషం. ఇక షో ముగిశాక అభిజిత్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారాడు. అదే సమయంలో తనకు సపోర్ట్‌ చేసిన సెలబ్రిటీలను సైతం కలుస్తున్నాడు. (చదవండి: మెహబూబ్‌ సైగలపై సోహైల్‌ రియాక్షన్‌)

మొన్న నాగబాబును కలిసిన అభి నిన్న హీరో విజయ్‌ దేవరకొండను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ మేరకు అతడితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్‌ చేస్తూ 'ఫుల్‌ చిల్'‌ అని రాసుకొచ్చాడు. కాగా రౌడీ హీరో విజయ్‌.. అభి హౌస్‌లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అతడికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక అభి హీరోగా నటించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్'‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఒక చిన్న నెగెటివ్‌ పాత్రలో నటించారు. ఆ సినిమాతో ఇద్దరూ క్లోజ్‌ అయ్యారు. అయితే మరోసారి రౌడీ విజయ్‌, పులి అభి కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని అభిమానులు కోరుతున్నారు. ఇదిలా వుంటే క్రిస్‌మస్‌ రోజు అభి సాంటాక్లాజ్‌గా మారిపోయి బహుమతులను పంచాడు. అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి పిల్లలతో వేడుకలు జరుపుకున్నాడు. చాక్టెట్లు, బ్యాడ్మింటర్‌ రాకెట్స్‌, క్యారమ్‌ బోర్డులు, ఇతర ఆటవస్తువులు సహా పలు బహుమతులు అందించాడు. (చదవండి: బిగ్‌బాస్‌ : హారిక నా చెల్లి.. అభిజిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు