Bigg Boss Telugu 6: శ్రీహాన్‌ నాపై అరిచాడు, నేను కాబట్టి సరిపోయింది..: మెరీనా

20 Nov, 2022 23:19 IST|Sakshi

Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్‌. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్‌ అయిపోగా ఆమె భర్త రోహిత్‌ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్‌మేట్స్‌ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూద్దాం..

నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్‌ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే..

కంటెస్టెంట్‌ బాటమ్‌ 5 కంటెస్టెంట్లు
ఆదిరెడ్డి మెరీనా, రోహిత్‌, రాజ్‌, కీర్తి, ఇనయ
ఇనయ రాజ్‌, శ్రీసత్య, మెరీనా, రోహిత్‌, ఆదిరెడ్డి
కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్‌, రాజ్‌, ఆదిరెడ్డి
రాజ్‌ మెరీనా, రోహిత్‌, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్‌
ఫైమా మెరీనా, రోహిత్‌, ఇనయ, కీర్తి, రాజ్‌
మెరీనా శ్రీహాన్‌, మెరీనా, ఇనయ, రాజ్‌, ఫైమా/శ్రీసత్య
శ్రీహాన్‌ రోహిత్‌, మెరీనా, కీర్తి, రాజ్‌, ఆదిరెడ్డి
రోహిత్‌ శ్రీహాన్‌, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్‌
శ్రీసత్య మెరీనా, రోహిత్‌, కీర్తి, ఇనయ, రాజ్‌
రేవంత్‌ మెరీనా, రోహిత్‌, కీర్తి, రాజ్‌, ఇనయ


హౌస్‌ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్‌ మెరీనా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్‌మేట్స్‌ ముందే పసిగట్టడంతో రోహిత్‌ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్‌. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్‌ ఎవరు? ఇంప్యూర్‌ ఎవరు? అనే గేమ్‌ ఆడించాడు నాగ్‌. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్‌ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్‌ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది.

అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్‌ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్‌ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్‌ అని పొగిడింది. రాజ్‌ దగ్గర యాటిట్యూడ్‌ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్‌ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది.

తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమాలను ఇంప్యూర్‌ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్‌ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్‌లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్‌ క్యాండిడేట్‌ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్‌ జర్నీకి ఫుల్‌స్టాప్‌ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది.

చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య
మెరీనా ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలివే!

మరిన్ని వార్తలు