న‌లిగిపోయిన అశ్విని, ఇచ్చిప‌డేసిన ర‌తిక‌.. సీరియ‌ల్ బ్యాచ్ సేఫ్‌ | Bigg Boss Telugu 7 Day 64 Episode Highlights: Priyanka Vs Ashwini Sri, Heated Arguments In Nominations - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Nov 7th Highlights: శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌత‌మ్‌.. వాళ్ల పోరు భ‌రించ‌లేక ఏడ్చేసిన అశ్విని

Published Tue, Nov 7 2023 1:01 AM

Bigg Boss Telugu 7: Priyanka Vs Ashwini Sri in Tenth Week Nominations - Sakshi

నామినేష‌న్స్ అంటే డైరెక్ట్‌గా బ‌య‌ట‌కు పంపించేయ‌రురా.. ఇదొక ప్ర‌క్రియ మాత్ర‌మే.. జ‌నాల‌కు న‌చ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వ‌ల్ల‌వేస్తుంటాడు శివాజీ. కానీ త‌న‌దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రైనా నామినేట్ చేస్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటాడు. అవ‌త‌లి వారి గొంతు పెగ‌ల‌నియ్య‌కుండా ఏది ప‌డితే అది అనేస్తాడు. ఈరోజు కూడా అదే జ‌రిగింది. త‌న‌ను నామినేట్ చేయ‌డంతో అత‌డి అహం దెబ్బ తింది. మ‌రి ఎవ‌రు ఎవ‌ర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (న‌వంబ‌ర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

క‌త్తులు దూసిన కంటెస్టెంట్లు
వాళ్లూ వీళ్లు చెప్తే కాదు, శివాజీని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవాలంటూ గౌత‌మ్‌కు స‌ల‌హాలిచ్చాడు అర్జున్‌. తాను కూడా స‌రైన స‌మ‌యం కోసం వేచి చూస్తున్నాన‌న్నాడు. అనంత‌రం బిగ్‌బాస్ నామినేష‌న్ ప్ర‌క్రియ గురించి వెల్ల‌డించాడు. ఈసారి నామినేష‌న్స్ బిగ్‌బాస్ మ‌హారాజ్యంలో జ‌రుగుతాయ‌ని, ఈ రాజ్యంలో శోభ‌, ప్రియాంక‌, అశ్విని, ర‌తికల‌ను రాజ‌మాత‌లుగా ప్ర‌క‌టించాడు. శంఖారావం వ‌చ్చిన ప్ర‌తిసారి ఇద్ద‌రు కంటెస్టెంట్లు క‌త్తుల‌ను బ‌య‌ట‌కు తీసి మిగ‌తా ప్ర‌జల్లో ఎవ‌రిని నామినేట్ చేయాల‌నుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రి నామినేష‌న్ స‌బ‌బు అనిపిస్తే వారిని రాజ‌మాత‌లు నేరుగా నామినేట్ చేస్తారు.

రాజ‌కీయాలు జ‌రిగాయ‌న్న భోలె
మొద‌ట అమ‌ర్‌, అర్జున్ క‌త్తులు అందుకున్నారు. అమ‌ర్ మాట్లాడుతూ.. భోలె షావ‌ళిని టీమ్ నుంచి వెళ్ల‌గొడుతుంటే త‌న‌ను తాను స‌మ‌ర్థించుకోలేక‌పోయాడ‌న్నాడు. దీనికి భోలె స్పందిస్తూ అక్క‌డ రాజ‌కీయాలు జ‌రిగాయ‌ని, అందుకే ఆ గ్రూపు నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి సంకోచించ‌లేద‌న్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. చెప్పుడు మాట‌లు విని గౌత‌మ్ శివాజీ మీద అస‌త్య‌ ఆరోప‌ణ‌లు చేశాడంటూ డాక్డ‌ర్‌బాబును నామినేట్ చేశాడు. అమ‌ర్‌, అర్జున్‌ల‌లో రాజ‌మాత‌లు అమ‌ర్ చెప్పిన పాయింట్ ఎక్కువ స‌మ్మ‌తంగా అనిపించ‌డంతో అత‌డి ప్ర‌కారం భోలెను డైరెక్ట్‌గా నామినేట్ చేశారు.

జీవితాల‌తో ఆడుకోకూడ‌దు.. సోది మొద‌లుపెట్టిన భోలె
ప్రిన్స్‌.. అమ‌ర్‌ను, ప్ర‌శాంత్‌.. గౌత‌మ్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజ‌మాత‌లు..ప్ర‌శాంత్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి గౌత‌మ్‌ను నామినేట్ చేశారు. త‌ర్వాత‌ భోలె షావ‌ళి.. అమ‌ర్ న‌న్ను వీక్ అన‌డం నచ్చ‌లేదంటూ నామినేట్ చేశాడు. కానీ అది సూటిగా చెప్ప‌కుండా జీవితాల‌తో ఆడుకోకూడ‌దు.. అదీ ఇదీ అని ఏదేదో సోది చెప్పాడు. ఇంత‌లో రాజ‌మాత ప్రియాంక‌కు రోషం పొడుచొక్కింది. అమ‌ర్ నిన్ను వీక్ అన‌లేదు, బిగ్‌బాస్ అన్నాడంటూ అత‌డి త‌ర‌పున లాయ‌ర్‌లా వాదించింది. ఊరుకో అని అశ్విని న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆమె మీద‌కు గ‌య్యిమ‌ని లేచింది.

శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌత‌మ్‌
గౌత‌మ్‌.. శివాజీ ఎవ‌రినో కొట్టేసి పోతాన‌న్నాడు. నాగ్ దాని గురించి అడిగితే త‌న‌ను తాను కొట్టుకుని పోతాన‌ని మాట మార్చాడని చెప్పాడు. రాజ‌మాత‌లు గౌత‌మ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి శివాజీని నేరుగా నామినేష‌న్‌లోకి పంపించారు. ఇది స‌హించ‌లేక‌పోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు క‌రెక్ట్‌గా అనిపించాయా? నేను త‌ప్పుడు నా బిడ్డ‌నైతే న‌న్ను ఎలిమినేట్ చేయండి అని ఆగ్ర‌హించాడు. ఇంత‌లో ప్రియాంక‌, శోభ‌.. అశ్విని గొడ‌వ‌ప‌డ్డారు. త‌న‌ను అస‌లు మాట్లాడ‌నివ్వ‌ట్లేద‌ని, గ‌డ్డిపోచ క‌న్నా హీనంగా చూస్తున్నార‌ని బాధ‌ప‌డింది అశ్విని. 

కాళ్లు మొక్కిన అశ్విని
నువ్వొక్క‌దానివి గ్రేట్‌.. ఇక్క‌డ కూర్చున్న మేమంతా వేస్టా? అని ప్రియాంక‌తో వాదిస్తూ ఏడ్చింది. మ‌ధ్య‌లో శోభ గ‌ట్టిగ‌ట్టిగా అరవ‌డంతో.. మేమిద్ద‌రం మాట్లాడుతుంటే నువ్వెందుకు మ‌ధ్య‌లోకి వ‌స్తున్నావని ఆమెపై ఫైర్ అయింది. కానీ వాళ్ల‌ముందు అశ్విని నిల‌బ‌డ‌గ‌ల‌దా? అశ్విని ఒక్క‌మాట అంటే ప్రియాంక‌, శోభ నాలుగు మాట‌లంటూ త‌న‌ను డామినేట్ చేశారు. వారితో అరిచే ఓపిక లేక ఏడుస్తూ ఇద్ద‌రి కాళ్లు మొక్కింది. దీంతో ఆ సీరియ‌ల్ న‌టులిద్ద‌రూ ఇదంతా ఓవ‌ర్ యాక్ష‌న్  అని తిట్టిపోశారు. అనంత‌రం శివాజీ, ప్రిన్స్ క‌త్తులు ప‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. మొద‌ట‌గా శివాజీ.. గోనెసంచి గేమ్‌లో అమ‌ర్ నా చేయి ప‌ట్టుకుని లాగ‌డంతో చేయంతా నొప్పి పుట్టిందంటూ నామినేట్ చేశాడు.

అమ‌ర్‌ను టార్గెట్ చేసిన ఆ ఇద్ద‌రు
నిజానికి ఈ శివాజీయే అమ‌ర్ వ‌ల్ల చేయి బాగైంద‌ని కూడా సంతోషించాడు. ఇప్పుడు అమ‌ర్‌ను టార్గెట్ చేస్తూనే పైకి మాత్రం ఇత‌ర‌త్రా కార‌ణాలు చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావ‌ర్ సైతం మ‌రోసారి అమ‌ర్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇద్ద‌రూ ఒక‌రినే నామినేట్ చేసేందుకు వీల్లేద‌న్నాడు బిగ్‌బాస్‌. ఎవ‌రో ఒక‌రిని నామినేట్ చేయ‌క‌పోతే నువ్వే నామినేట్ అవుతావ‌ని హెచ్చ‌రించాడు. దీంతో యావ‌ర్ త‌న‌కు తానుగా నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అటు రాజ‌మాతలు కూడా యావ‌ర్‌నే నామినేట్ చేశారు. ఈరోజు చాలామంది అమ‌ర్‌ను నామినేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా రాజ‌మాత‌లు మాత్రం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసి అత‌డిని కాపాడారుజ.

బ‌లైన ర‌తిక‌
అనంత‌రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. రాజ‌మాత‌లు చ‌ర్చించుకుని వారిలో ఒక‌రు నామినేట్ అవ్వాల‌న్నారు. ర‌తిక‌, అశ్విని.. ప్రియాంక‌ను నామినేట్ చేయ‌గా ప్రియాంక‌, శోభ‌.. ర‌తిక‌ను నామినేట్ చేశారు. ప్రియాంక‌, ర‌తిక‌కు టై అవ‌డంతో నామినేష‌న్ బాధ్య‌త‌ను కెప్టెన్‌కు అప్ప‌గించాడు బిగ్‌బాస్‌. శోభకు మ‌రో ఆప్ష‌నే లేదు, ప్రియాంక‌ను సేవ్ చేసి ర‌తిక‌ను నామినేట్ చేసింది. కానీ ఈ క్ర‌మంలో పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. నువ్వు నాకు ఆఫ్ట్రాల్ అంటూ శోభ‌కు ఇచ్చిప‌డేసింది ర‌తిక‌.ఈ వారం భోలె షావ‌ళి, శివాజీ, గౌత‌మ్‌, ప్రిన్స్ యావ‌ర్‌, ర‌తిక రోజ్ నామినేష‌న్‌లో ఉన్నారు.


చ‌ద‌వండి: జూన్‌లో పెళ్లి.. త్వ‌ర‌లో తండ్రి కాబోతున్న హీరో..

Advertisement

తప్పక చదవండి

Advertisement