ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 63 ఏళ్లంటే నమ్ముతారా? | Bollywood Actress Sangeeta Bijlani Biography In Telugu - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమె స్టార్ హీరోయిన్.. టీమిండియా క్రికెటర్ మాజీ భార్య కూడా

Published Fri, Sep 1 2023 4:54 PM

 Bollywood Actress Sangeeta Bijlani Details - Sakshi

వయసు పెరిగితే ఏమవుతుంది.. హా ఏముంది అందం తగ్గిపోతుంది, ముసలివాళ్లు అయిపోతామని మీరు అంటారు. ఈ బ్యూటీకి మాత్రం 'ఓల్డ్' అనే పదం వర్తించదేమో! ఎందుకంటే టీనేజ్‌లో ఎలా ఉండేదే ఏమో కానీ ఇప్పుడు మాత్రం సూపర్ హాట్‌గా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది. 63 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల‍్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. పేరు సంగీతా బిజ్లానీ. ముంబయిలో 1960లో పుట్టింది. తల్లి ప్రోత్సాహంతో 16 ఏళ్లకే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ బ్రాండ్స్ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో యాక్ట్ చేసింది. అప్పట్లో ఈమెని అందరూ 'బిజిలీ' అని ముద్దుగా పిలిచేవారు. అలా కొన్నాళ్లపాటు మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. 20 ఏళ్లకే మిస్ ఇండియా కిరీటం గెలిచి తెగ పాపులర్ అయిపోయింది. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది కానీ విజయం సాధించలేకపోయింది.

(ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇ‍ప్పుడు లాయర్‌గా!)

అలా మోడల్, మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత.. యాక్టింగ్ మాత్రం కాస్త లేటుగా మొదలుపెట్టింది. 1988లో హీరోయిన్‌గా తొలి సినిమా చేసిన ఈమె.. వరసగా తొమ్మిదేళ్లు మాత్రమే బాలీవుడ్‌లో యాక్ట్ చేసింది. హిందీ కాకుండా మధ్యలో ఓ కన్నడ సినిమా చేసింది అంతే. 1996లో టీమిండియా క్రికెటర్  అజహారుద్దీన్‌ని పెళ్లి చేసుకునేసరికి పూర్తిగా నటనని పక్కనబెట్టేసింది. ఏమైందో ఏమో దాదాపు 14 ఏళ్ల కాపురం చేసిన తర్వాత 2010లో  విడాకులు తీసుకుంది.

నటిగా ఫామ్‌లో ఉ‍న్నప్పుడే బుల్లితెరపైనా సందడి చేసిన సంగీతా బిజ్లానీ.. 2021లో సూపర్ డ్యాన్సర్ షోలో గెస్ట్‌గా సందడి చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 63 ఏళ్లు. కానీ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఫిజిక్, అందాన్ని ఫెర్ఫెక్ట్‌గా మెంటైన్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యే ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సంగీత.. తన హాట్‌నెస్‌తో స్టేజ్ మొత్తాన్ని హీటెక్కించిందని చెప్పొచ్చు. ఆ వీడియోని మీరు ఓసారి చూసేయండి. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు)

Advertisement
Advertisement