యంగ్‌ హీరోల కొంపముంచిన బోయపాటి!

8 Oct, 2023 17:13 IST|Sakshi

ఊరమాస్‌ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన మేకింగ్‌లో ఓ పవర్‌ ఉంటుంది. అది మాస్‌ ఆడియన్స్‌కు ఎక్కడలేని కిక్‌ అందిస్తుంది. అయితే ఇది కేవలం సీనియర్‌ హీరోల విషయంలోనే జరుగుతుంది. యంగ్‌ హీరోలకు మాత్ర బోయపాటి భారీ ఫ్లాపులను అందిస్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్‌ తప్ప మిగతా ఏ యంగ్‌ హీరోలకి బోయపాటి హిట్‌ అందించలేదు. 

2012లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ తీశాడు. అది బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక(2017) తీస్తే..అది హిట్‌ కాలేదు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌తో  ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్‌ అయింది. ఇక తాజాగా రామ్‌ పోతినేనితో ‘స్కంద’ చేయగా..అది కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్‌!
బోయపాటిపై ‘స్కంద’ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. స్కంద రిలీజ్‌కు ముందు ఆయన తర్వాత సినిమా బన్నీతో ఉంటుందనే వార్తలు వినిపించాయి. మరోవైపు సూర్య కూడా బోయపాటి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వచ్చింది. చిరంజీవీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.

అయితే స్కంద రిలీజ్‌ తర్వాత మాత్రం ఈ  పుకార్లు వినిపించడం లేదు. పైగా బోయపాటితో సినిమా చేయడానికి యంగ్‌ హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.   సూర్య కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా ఫ్లాప్‌ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. దీంతో బోయపాటి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్‌. 

మరిన్ని వార్తలు