Actor Siddharth: స్టార్ హీరో అని చూడకుండా బయటకు పంపేశారు!

28 Sep, 2023 20:45 IST|Sakshi

స్టార్ హీరో సిద్ధార్థ్‪‌కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఇతడికి చేదు అనుభవం ఎదురైంది. నేరుగా ఈవెంట్ జరుగుతున్న చోటుకే వచ్చిన కొందరు వ్యక్తులు ప్రెస్‌మీట్‌ని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

హీరో సిద్ధార్థ్ నటించి నిర్మించిన కొత్త సినిమా 'చిత్తా'. దీన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ లో పెట్టాడు. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. దీంతో అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన కరవే కార్యకర్తలు.. సిద్ధార్థ్‌ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రమోషన్స్ కి ఇది సరైన టైమ్ కాదని, వేరే ఎప్పుడైనా చేసుకోవాలని చెప్పారు. 

దీంతో విషయం అర్థం చేసుకున్న సిద్ధార్థ్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. అందరూ తన సినిమా చూడాలంటూ చేతులు జోడించి మరీ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. అయితే కరవే కార్యకర్తలు వచ్చినప్పుడు సిద్దార్థ్ కన్నడలో తన సినిమా గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ప్రసంగాన్ని అడ్డుకున్న కరవే కార్యకర్తలు.. తమిళ సినిమా ఎవరూ ప్రోత్సాహించొద్దని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తమిళ-కన్నడ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?)

మరిన్ని వార్తలు