సూర్య కొత్త సినిమా ప్రకటన.. స్టోరీ లైన్‌ ఎంటో తెలిస్తే!

19 Jul, 2023 09:39 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. సూర్య తన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువ’తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.  మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఇందులో కీలక పాత్రలో మెరవనుంది.

(ఇదీ చదవండి: చరణ్‌ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్‌ పంపిన ఎన్టీఆర్‌)

సూర్య బర్త్‌డే జులై 23న ఘనంగ జరగనుంది. అందులో భాగంగానే కంగువ సినిమా తొలి గ్లింప్స్‌ను జులై 22న మేకర్స్‌ విడుదల చేయనున్నారు.  ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య పుట్టినరోజు నాడే అభిమానులకు మరో శుభవార్త ఆయన చెప్పనున్నారు. తన తదుపరి చిత్రం వివరాలు ప్రకటించనున్నారు.

దానిని ఒక లేడీ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూర్య 43 సినిమాకు దర్శకురాలు కానుందని టాక్‌. తను తెలుగులో కూడా వెంకటేశ్‌తో 'గురు' సినిమాను డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సుధ కొంగర పుట్టింది విశాఖలో అయినా ఆమె చెన్నైలో స్థిరపడింది.

సినిమా గురించి సుధ ఏం చెప్పిందంటే..
గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధ ఇలా చెప్పింది. ఆకాశమే నీ హద్దురా సినిమా కంటే సూర్యతో  భారీ బడ్జెట్‌లో  సినిమా తీయబోతున్నట్లు చెప్పింది. ఆ కథకు భారీగా ఖర్చు అవుంతుందని, అందుకు కొంచెం భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీస్తున్నా బయోపిక్‌ మాత్రం కాదని పేర్కొంది. ఈ సినిమాకు  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వనున్నారు. సుధ కొంగరకు సూర్య మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్‌ అర్థం ఇదేనా?)

మరిన్ని వార్తలు