Sakshi News home page

కల్కి వాయిదా పడితే.. ఆ సినిమాతో బిగ్‌ఫైట్‌ గ్యారెంటీ

Published Mon, Mar 18 2024 3:17 PM

If Kalki 2898 AD Movie Gets Postponed Then When Can It Be Released Again - Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ చిత్రానికి సంబంధించిన మేకర్స్‌ నుంచి అధికారికంగా ఎలాంటి  ప్రకటన రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఒకవేళ కల్కి వాయిదా పడితే ఏ తేదీలో విడుదల కావచ్చో అని వారు లెక్కలేసుకుంటున్నారు.

కల్కి మే 9న విడుదల అవుతుందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసి ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఎప్పుడో ప్రకటించింది. ఒకవేళ కల్కి వాయిదా పడి.. పుష్ప చిత్రంతో పోటీపడితే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ఫైట్‌ జరగడం ఖాయం అని చెప్పవచ్చు.

ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్‌' కూడా రానుంది.  ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్‌, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్‌ కుమార్‌ సినిమా  'భైరతి రంగల్‌'  ఉంటే.. బాలీవుడ్‌లో భారీ స్టార్స్‌తో వస్తున్న సింగం ఎగైన్‌ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలతో పాటు కల్కి కూడా ఆగష్టు 15న వస్తే పుష్ప గాడు ఎంతమేరకు తట్టుకుని నిలబడుతాడో వేచి చూడాలి. కల్కి వాయిదా అంశం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement