Jayam Ravi Agilan Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Agilan Telugu Movie Review: జయం రవి అఖిలన్‌ సినిమా రివ్యూ

Published Sat, Mar 11 2023 12:16 PM

Jayam Ravi Agilan Movie Review In Telugu - Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాజు అరుళ్‌మొళిగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు జయం రవి తాజాగా అఖిలన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్క్రీన్‌ స్కిన్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఇది భూలోకం చిత్రం ఫేమ్‌ కల్యాణ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి ప్రియాభవాని శంకర్‌ నాయకిగా నటించగా నటి తాన్యా రవిచంద్రన్‌ కీలక పాత్ర పోషించారు. నటుడు జయం రవి నటించిన 28వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ది కింగ్‌ ఆఫ్‌ ది ఓషన్‌ అనే ట్యాగ్‌ లైన్‌ పెట్టారు. ఇది సముద్రతీరంలో మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని క్యాప్షన్‌ చూస్తేనే అర్థమైపోతుంది. 

కథ:
దేశ ఆర్థిక లావాదేవీలను శాసించే వేదిక హార్బర్‌. అక్రమాలు, హత్యలు స్మగ్లింగ్‌ వంటి దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచేది హార్బరే అని చెప్పే కథా చిత్రం అఖిలన్‌. అలాంటి నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిందే ఈ సినిమా.  ఒక కూలీగా పని చేసే అఖిలన్‌ ఓ మాఫియా ముఠా దుర్మార్గాలకు సహకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనే ఒక మాఫియా డాన్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. హార్బర్‌లో జరిగే అక్రమాలకు అన్నిటికీ తనే కారణంగా మారతాడు. అతనికి హార్బర్లో పనిచేసే పోలీస్‌ అధికారి ప్రియ భవాని శంకర్‌ సహకరిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా అతను ఎందుకు చేస్తున్నాడు? తర్వాత అతని జీవితం ఎటువైపు సాగింది? వంటి పలు సంఘటనలతో సాగే చిత్రం అఖిలన్‌.

విశ్లేషణ
ఈ చిత్రంలో జయంరవి తన నటనతో మెప్పించారు. ఇందులో జయం రవి తండ్రి పాత్ర కూడా ఉంటుంది. ఆయన కలను సాకారం చేయడం కోసమే అఖిలన్‌ పోరాడతాడు. అయితే దాన్ని నెరవేర్చగలిగాడా? లేదా? అసలు ఆయన తండ్రి కల ఏమిటి అన్న ఆసక్తికరమైన అంశాలతో పలు మలుపులతో అఖిలన్‌ చిత్రం సాగుతుంది. కథ పూర్తిగా హార్బర్‌లోనే సాగుతుంది. జయం రవిది నెగటివ్‌ షేడ్‌లో సాగే పాజిటివ్‌ పాత్ర అని చెప్పవచ్చు. దాన్ని ఆయన సమర్థవంతంగా పోషించారు. అఖిలన్‌ కమర్షియల్‌ అంశాలతో సాగే అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం.

Advertisement
Advertisement