ట్రాన్స్‌జెండర్‌గా మారిన హాలీవుడ్‌ స్టార్‌

2 Dec, 2020 14:30 IST|Sakshi

ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన హాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ ‌ ఎలేన్‌ పేజ్‌ సంచలన ప్రకటన చేశాడు.  తాను ట్రాన్స్‌జెండర్‌నని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 'జూనో' చిత్రంలోని నటనకు గాను ప్రపంచ ‍ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఎలెన్‌..తాను ట్రాన్స్‌నని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలిపాడు. ఈ వార్తను పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ట్రాన్స్‌ కమ్యునిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటినుంచి తనకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇఫ్టపడుతున్నానని, ఇది చాలా గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నాడు.  ఈ  సందర్భంగా ట్విట్టర్‌లో ట్రాన్స్‌ కమ్యూనిటీ ఆరోగ్యంపై పట్టించుకోని రాజకీయ నాయకులపై విమర్శలు గుప్పించారు. ‍ ట్రాన్స్‌ల పట్ల తమ అసహ్యతను ప్రదర్శించే నాయకుల వల్లే ట్రాన్స్‌జెండర్స్‌ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. (రూమర్లను ఖండించిన పాక్‌ నటి.. నెటిజన్లపై అసహనం)

మానవాతీత శక్తులుండే కొందరు చేసే సాహసాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘ఎక్స్‌మెన్‌’ సినిమాలో  కిట్టీ ప్రైడ్‌ పాత్రలో నటిగా ఆకట్టుకున్న  ఎలెన్‌ పేజ్ ఆ తర్వాత నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ‘హార్డ్‌క్యాండీ’ సినిమాతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డు  అందుకున్నారు. ‘జూనో’ అనే చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2007లో విడుదలైన  ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను పోషించారు. ఎలాంటి ప్లాన్స్‌ చేయకుండా ఓ టీనేజర్‌ అనుకోకుండా గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న పాత్రలో ఎలేన్‌ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ-డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో ఎలేన్‌ నటనకు గానూ ఆస్కార్‌ అవార్డుకు నామినెట్‌ అయ్యాడు. (ఆ బిగ్‌బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది‌)

తాన్ను ఒక ట్రాన్స్‌నన్న ఎలెన్‌  తాజా స్టేట్‌మెంట్‌తో ది అమ్‌బ్రిల్లా అకాడమీ సిరీస్‌లో ఆయన నటించే పాత్రలో ఎలాంటి మార్పులు ఉండవని యూనిట్‌ స్పష్టం చేసింది. వన్య హార్గ్రీవ్స్ అనే మహిళ పాత్రలో ఇంతకుముందులానే  ఎలేన్‌ నటించనున్నారని ఎలేన్‌ ట్రాన్స్‌ స్టేట్‌మెంట్‌కు తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. ఎలేన్‌ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఎల్‌జీబీటిక్యూ కమ్యూనిటి ప్రతినిధులు సైతం ఎలెన్‌ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఎలేన్‌ భార్య ,  ఎమ్మ పోర్ట్‌నర్ కూడా తన మద్దతును ప్రకటించింది.  ఎలెన్‌ను చూసి గర్వపడుతున్నానని.. ట్రాన్స్‌జెండర్లు, నాన్ బైనరీ పీపుల్ ప్రపంచానికి బహమతులు అని తెలిపింది. ఈ సందర్భంగా ఎలెన్‌ వ్యక్తిగత నిర్ణయంపై సంయమనం పాటించాలని కోరుతూ ట్వీట్‌ చేసింది. గతంలో తానోక లెస్బెనియన్‌ అని గర్వంగా ప్రకటించుకున్న ఈ ఎక్స్‌ మెన్‌ యాక్టర్‌ ఎలేన్‌ పేజ్  సహ నటి, డాన్సర్‌ అయిన ఎమ్మా పోర్ట్‌నర్‌ని వివాహం చేసుకున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. గతంలోనూ నటి సమంత థామస్‌తో కూడా ఎలెన్‌ రెండేళ్లపాటు సహజీవనం చేశారు. (సహ నటితో హీరోయిన్‌ సీక్రెట్‌ వివాహం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా