న్యూలుక్‌లో అదరగొట్టిన నటి, పెళ్లి ప్రపోజల్‌కు రిప్లై

23 Aug, 2021 21:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బొద్దుముద్దుగా తెలుగు, తమిళ సినిమాలతో ఆకట్టుకున్న నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ కొత్త అవతారంతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఐదుపదుల వయసులో 30 ఏళ్ల స్టన్నింగ్‌ బ్యూటీగా అదరగొట్టడంతో దాదాపు ఎవరూ గుర్తు పట్టలేక పోయారు.  స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు ఇటీవల భారీ కసరత్తులు మొదలు పెట్టిన ఆమె రీసెంట్ ఫోటో షూట్‌తో ఆశ్చర్యంలో ముంచెత్తేసింది.  10 నెలల్లో దాదాపు 12 కిలోల బరువు తగ్గి స్టన్నింగ్ మేకోవర్‌తో  ఔరా అనిపించారు.  అంతేకాదు ఈ సందర్బంగా నెటిజన్‌  కొంటె ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై కూడా వైరల్‌ అయింది. 

చదవండి :  అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగ‌లేక పాట్లు!

‘‘హార్డ్ వర్క్ ఫలితాలు ఇచ్చినప్పుడు, సంతోషాన్ని వివరించలేము" అంటూ నటి ఖుష్బూ ట్రెండీ డ్రెస్‌లో తన లేటెస్ట్‌ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోలు  వైరల్‌ అయ్యాయి. అయితే ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్‌ ఒకరు..మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని ప్రపోజ్‌ చేశాడు. దీనికి స్పందించిన ఆమె సారీ నువ్ బాగా లేట్.. 21 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అయినా సరే ఒకసారి నా భర్తని అడిగి చెబుతా అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. ఇది అక్కడిదే ఆగిపోలేదు.. మీ భర్త నుంచి సమాధానం వచ్చిందా మేడం అంటూ ఆరాతీశాడు.  దీంతో ఆయనకు నేను మాత్రమే భార్యని.. కాబట్టి సారీ అని చెప్పామన్నారు.  నన్ను వదులుకునేందుకు రెడీగా లేరు' అని ఖుష్బూ సమాధానం ఇచ్చింది.  నెటిజన్‌కు ఖుష్బూకి  మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్‌!

కాగా తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిలా వెలిగిన ఖుష్బూ తాజాగా రజనీకాంత్ రాబోయే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో టాలీవుడ్‌కి  రీఎంట్రీ ఇస్తోంది. ఇక రాజకీయ పరంగా చూస్తే  కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇటీవలే బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది!

A post shared by Kushboo Sundar (@khushsundar)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు