Aparna Nair: 50 పైగా సినిమాలతో మెప్పించిన ప్రముఖ నటి మృతి.. పలు అనుమానాలు | Malayalam Actor Aparna P Nair Found Dead At Her Home - Sakshi
Sakshi News home page

Aparna Nair: ప్రముఖ నటి మృతి.. పలు అనుమానాలు

Published Fri, Sep 1 2023 1:39 PM

Malayalam Actress Aparna Nair Found Dead In Trivandrum - Sakshi

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణవార్త అక్కడ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళ పరిశ్రమలో సినీ నటి మరణవార్త కలిచి వేసింది. మలయాళంలో సుమారు 50 సినిమాలతో పాటు  బుల్లితెరపై పలు సీరియల్స్‌తో చురుగ్గా ఉండే నటి అపర్ణా నాయర్ (33).. తెలుగులో కూడా 'చిన్ని చిన్ని ఆశ' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆమె నిన్న (ఆగస్టు 31) రాత్రి 7 గంటలకు రాజధాని తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లోని తన ఇంట్లో మృతి చెందారు. కానీ ఆమె మరణానికి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.

(ఇదీ చదవండి: మెగాస్టార్‌ చిరంజీవి వాచ్‌ ధర తెలిస్తే.. ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే)

అపర్ణ మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని  సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా నాయర్ మలయాళం సినిమాలు, సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఆమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనేది నిజం.. దీంతో ఆమె అభిమానులు తీవ్ర శోకంలో ఉన్నారు. అపర్ణ మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నటుడు సంజిత్‌ను ఆమె  వివాహం చేసుకుంది. వారికి   త్రయ, కృతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

(ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్)

ఇప్పటికే ఆమె మృతిపై కరమన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలో నటి మృతికి గల కారణాలు తెలుపాతమని చెప్పారు.  అపర్ణా నాయర్ తిరువనంతపురంలో ఉండేవారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆమె తల్లి, సోదరి ఉన్నట్లు సమాచారం. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న అపర్ణను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కూతురిని పోగొట్టుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

అపర్ణ మృతికి అభిమానులు సంతాపం
నటి అపర్ణ మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను, సన్నిహితులను తీవ్ర వేదనకు గురిచేసింది. నటి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు చెందిన సహచరులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అపర్ణా నాయర్ 2005లో మయూఖం సినిమాతో అరంగేట్రం చేసి, ఆ తర్వాత రన్ బేబీ రన్, సెకండ్స్, అచ్చయాన్స్, మేఘతీర్థం, ముద్దుగౌ, కార్ట్ సమక్షమ బాలన్ వాకిల్, కల్కి వంటి అనేక చిత్రాలతో పాటు చందనమజ, ఆత్మసఖి సీరియల్స్‌లో నటించారు.

Advertisement
Advertisement