Namrata Shirodkar: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత ఎమోషనల్ నోట్

29 Aug, 2023 23:46 IST|Sakshi

నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న  తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. మహేశ్, నమ్రతకు సితార, గౌతమ్ జన్మించారు. సామాజిక సేవలోనూ ముందుండే నమ్రత తాజాగా తన కుమారుని గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

నమ్రత ఇన్‌స్టాలో రాస్తూ.. 'నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.  రెయిన్‌బో ఆస్పత్రిలోని పిల్లలను కలవడం సంతోషంగా ఉంది. చికిత్స తీసుకుంటున్న పిల్లలతో కలిసి.. క్యాన్సర్‌ బారిన పడిన పిల్లల్లో గుండె ధైర్యాన్ని నింపడం చూస్తుంటే గర్వంగా ఉంది. వాళ్ల కోసం బహుమతులు తీసుకెళ్లడం.. చిరునవ్వులను చిందించే చిన్నారులతో సరదాగా ఉండడం. ఇలా చేయడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకుంటుంటారు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్‌కు ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  వావ్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

కాగా.. మహేశ్ బాబు ఫౌండేషన్‌తో రెయిన్‌బో ఆస్పత్రి కలిసి పని చేస్తోంది. ఎంబీ ఫౌండేషన్‌  సహకారంతో చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ ఉచితంగా అందిస్తున్నారు.  ఇప్పుడు ఆదే బాటలో ఆయన కుమారుడు గౌతమ్‌ కూడా చేరిపోయారు. గుండె ఆపరేషన్‌ చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రికి వెళ్లి పలకరిస్తున్నాడు. 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మరిన్ని వార్తలు