వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు! | Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

Vignesh Shivan: చిక్కుల్లో డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. క్రిమినల్ చర్యలు తప్పవా?

Published Sun, Jan 7 2024 11:57 AM

Nayanthara Husband Vignesh Shivan Trouble With His LIC Movie Title - Sakshi

ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఒక్క పేరు వల్ల రెండు వివాదాలు ఇతడిని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ పెద్ద సంస్థ.. విఘ్నేశ్‌కి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? గొడవేంటి?

తమిళంలో పేరున్న దర్శకుల్లో విఘ్నేశ్ శివన్ ఒకడు. 'నా పేరు రౌడీ' లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా 'ఎల్ఐసీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టైటిల్‌పై రోజుల వ్యవధిలో రెండు కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి.

(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజస్టర్ చేయించుకున్నానని చెప్పారు.  ఈ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ వివాదం అలా ఉండగానే ఇప్పుడు మరొకటి వచ్చింది.

ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌కి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, సినిమా కోసం ఈ టైటిల్‌ని ఉపయోగిస్తే.. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోపు పేరు మార్చకపోతే లీగల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై చిత్రబృందం, విఘ్నేశ్ స్పందించాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ)

Advertisement
Advertisement